ఆర్ధిక మాంద్యం( Economic depression ) దెబ్బకు అగ్రరాజ్యం అమెరికా వణుకుతోంది.ఆ దేశానికి చెందిన దిగ్గజ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తున్న సంగతి తెలిసిందే.
రానున్న రోజుల్లో ఈ పరిస్ధితి మరింత తీవ్రంగా వుండే అవకాశం వుందని ఆర్ధిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.అమెరికాలో ఉద్యోగాలు కోల్పోతున్న విదేశీ కార్మికుల్లో భారతీయులు కూడా వున్నారు.
గూగుల్ , మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి కంపెనీలలో లే ఆఫ్‌ల కారణంగా భారతీయులు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలను కోల్పోతున్నారు.
యూఎస్ మీడియా నివేదికల ప్రకారం.గతేడాది నవంబర్ నుంచి దాదాపు 2,00,000 మందికిపైగా ఐటీ ఉద్యోగులు తొలగించబడ్డారు.అమెరికాలో ఉద్యోగం కోల్పోయిన విదేశీ ఐటీ నిపుణుల్లో 30 నుంచి 40 శాతం మంది భారతీయులేనని నివేదికలు చెబుతున్నాయి.
వీరిలో చాలా మంది హెచ్ 1బీ,( H-1B Visa) ఎల్ 1 వీసాలపై వున్నవారేనని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి.
మరోవైపు.ఉద్యోగం పోయిందన్న బాధ కంటే హెచ్1బీపై వున్న వారికి 60 రోజుల నిబంధన కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.హెచ్ 1 బీ వీసాతో అమెరికాలో వుంటున్న విదేశీ ఉద్యోగులు .తమ ఉద్యోగం కోల్పోయిన 60 రోజుల్లోగా మరో ఉద్యోగంలో చేరాల్సి వుంటుంది.లేని పక్షంలో అట్టివారు అమెరికాలో ఉండటానికి అనర్హులు.
ఈ నేపథ్యంలో ఉద్యోగాలు కోల్పోయిన వారు తీవ్ర ఆందోళనలో వున్నారు.ఈ నేపథ్యంలో 60 రోజుల నిబంధనను 180 రోజులకు పెంచాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇప్పటికే ఉద్యోగాలు కోల్పోయిన వారు, ఉద్యోగం చేస్తున్న వారు ఈ నిబంధనకే భయపడుతున్నారు.కుటుంబంతో సహా అమెరికాలోనే స్థిరపడాలని భావిస్తున్న వారికి ఈ రూల్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.ఈ నేపథ్యంలో ఇలాంటి వారికి ప్రెసిడెన్షియల్ అడ్వైజరీ సబ్ కమిటీ కొద్దిరోజుల క్రితం శుభవార్త చెప్పింది.వీసా గడువు( Visa ) (గ్రేస్ పీరియడ్)ను 60 రోజుల నుంచి 180 రోజులకు పొడిగించాల్సిందిగా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ, యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్)కు ఈ కమిటీ సిఫారసు చేసింది.
దీనికి ప్రభుత్వ ఆమోదం లభిస్తే విదేశీ వృత్తి నిపుణులు ముఖ్యంగా భారతీయులకు ఊరట లభించినట్లే.ఇది అమల్లోకి వస్తే ఉద్యోగం కోల్పోయినప్పటికీ 180 రోజుల్లో మరో కొత్త కొలువును సంపాదించుకునేందుకు వీలు కలుగుతుంది.