ఇటీవల కాలంలో చాలా వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం.పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తే నమ్మలేని నిజాలు వెలుగులోకి వస్తున్నాయి.
ఇందులో దాదాపు 70 శాతం మంది వ్యక్తులు అక్రమ సంబంధాల కారణంగా హత్యకు గురవుతున్నారు.అలాంటి కోవకు చెందిన ఒక సంఘటన ఇటీవలే వెలుగులకు వచ్చింది దానికి సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.
వివరాల్లోకెళితే కామారెడ్డి జిల్లా( Kamareddy ) భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామంలో బందెల బాబు (42)( Bandela Babu ) ఈనెల మూడవ తేదీన అనుమానాస్పద మృతి( Suspected Death ) చెందడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.పోలీసుల విచారణలో అసలు నిజాలు బయటపడ్డాయి.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బందెల బాబు, లావణ్య వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవారు.లావణ్య కు( Lavanya ) అనారోగ్యం కారణంగా ఎల్లారెడ్డి మండలం కొక్కొండకు చెందిన భూత వైద్యుడు దర్శనాల సాయిలు వద్దకు వెళ్లారు.అక్కడే లావణ్య కు, సాయిలు కు పరిచయం కాస్త అక్రమ సంబంధానికి దారి తీసింది.ఈ విషయం భర్తకు తెలియడంతో లావణ్యను గట్టిగా మందలించాడు బందెల బాబు.

ప్రియుడిని మర్చిపోలేకపోయినా లావణ్య చివరకు ప్రియుడితో కలిసి ఈ నెల మూడవ తేదీ భర్తకు విపరీతంగా మద్యం తాగించి ప్రియుడు సాయిలు తో కలిసి మొబైల్ చార్జర్ వైర్ మెడకు చుట్టి ముఖంపై తల దిండు పెట్టి, ఊపిరి ఆడనీయకుండా చేసి భర్తను హతమార్చింది.ఆ తరువాత తనకేమీ తెలియనట్టుగా, బందెల బాబు అధికంగా మద్యం సేవించి అనుమానాస్పద స్థితిలో అని ఇచ్చినట్టు తెలిపింది.కానీ దర్యాప్తులో భాగంగా పోలీసులు లావణ్యను విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.దీంతో లావణ్యను అరెస్టు చేసి రిమాండ్కు పంపించారు.







