కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్( Vetrimaran ) గురించి ప్రత్యేకంగా పనిచేయడం అక్కర్లేదు.కోలీవుడ్లో పరాజయం ఎరుగని దర్శకుడిగా దూసుకుపోతున్నారు వెట్రిమారన్.
ఇప్పటివరకు వెట్రిమారన్ దర్శకత్వం వహించిన సినిమాలు అన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ హిట్టుగా నిలిచాయి.ఇది ఇలా ఉంటే గత రెండు మూడు రోజులుగా డైరెక్టర్ వెట్రిమారన్ టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

డైరెక్ట్ సినిమా సంగతి పక్కన పెడితే తాజాగా తన దర్శకత్వం వహించిన సినిమాను తెలుగులో డబ్ చేసి విడుదల చేస్తున్న విషయం తెలిసిందే.ఈ సందర్భంగా ఈ సినిమా ప్రమోషన్స్ కోసం తాజాగా హైదరాబాద్ కి వచ్చారు వెట్రిమారన్.నేపథ్యంలోనే ఆయన మాట్లాడుతూ పలు షాకింగ్ విషయాలను వెల్లడించారు.ఇప్పటికీ అల్లు అర్జున్, ఎన్టీఆర్( Allu Arjun NTR ) కాంబినేషన్లో మల్టీ స్టారర్ సినిమా రాబోతోంది అన్నదానికి హింట్ ఇచ్చిన విషయం తెలిసిందే.
ఇది ఇలాంటి తాజాగా ఆయన మాట్లాడుతూ.పందెం కోళ్ళు సినిమా రిలీజ్ అయిన తర్వాత అల్లు అర్జున్ నేను చెన్నైలో కలిసాము.

కోలీవుడ్ కి ఎంట్రీ ఇద్దామనుకుంటున్నాను మీకు ఇంట్రెస్ట్ మంచి కథ రాయండి అని నాకు అల్లు అర్జున్ తెలిపారు.అప్పుడు నేను వడ చెన్నై స్క్రిప్ట్ చెప్పాను.కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ను( Dhanush ) ఢీకొట్టే రోల్ ఆఫర్ చేశాను.హైదరాబాద్ కి వచ్చి గీత ఆర్ట్స్ ఆఫీసులో ఆ పాత్ర గురించి వివరంగా చెప్పాను.
కానీ మరొక హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఇష్టం లేకపోవడంతో ఆ సినిమాకు నో చెప్పాడు అని తెలిపారు వెట్రిమారన్.కాగా వెట్రిమారన్ వహించిన సినిమా తెలుగులో ఏప్రిల్ 15న విడుదల కానుంది.







