'సలార్' కాంబో మళ్ళీ రిపీట్.. ఈసారి మరింత గ్రాండ్ గా..

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ లలో దిల్ రాజు (Dil Raju) ఒకరు.ప్రజెంట్ ఈయన కెరీర్ పరంగా మంచి సక్సెస్ లతో దూసుకు వెళ్తున్నాడు.

 Dil Raju Latest Comments On Movie With Prabhas Details, Prabhas, Game Changer, D-TeluguStop.com

చిన్న సినిమాలనే కాకుండా భారీ బడ్జెట్ సినిమాలను కూడా దిల్ రాజు తన ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.దిల్ రాజు ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ (Game Changer) ను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

మెగా ఫ్యాన్స్ భారీ అంచనాలను పెట్టుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఇదంతా పక్కన పెడితే తాజాగా నిర్మాత దిల్ రాజు శాకుంతలం మూవీ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు.

ఏప్రిల్ 14న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా కోసం దిల్ రాజు సిద్ధం అవుతున్నాడు.మరి ఈ ప్రమోషన్స్ లో మరోసారి ప్రభాస్ తో సినిమా చేయబోతున్న దిల్ రాజు కన్ఫర్మ్ చేసారు.

అది కూడా ఏ కాంబో కూడా చెప్పారు.ప్రభాస్ (Prabhas) హీరోగా ప్రశాంత్ నీల్ (Prashanth Neel) డైరెక్టర్ గా భారీ బడ్జెట్ సినిమాను నిర్మిస్తానని.ప్రజెంట్ ఉన్న కమిట్మెంట్స్ పూర్తి అయిన తర్వాత ఈ సినిమా ఉంటుంది అని చెప్పుకొచ్చాడు.అయితే ఈ కాంబోలో ఇప్పటికే సలార్ (Salaar) వంటి భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కుతుంది.

కెజిఎఫ్ సినిమాతో సంచలన విజయం అందుకున్న నీల్ ఆ తర్వాత వెంటనే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ను లైన్లో పెట్టాడు.

ఈ సినిమాను నీల్ హై వోల్టేజ్ యాక్షన్ కథాంశంతో తెరకెక్కిస్తున్నాడు.హోంబలే వారు భారీ స్థాయిలో హాలీవుడ్ రేంజ్ లో సినిమాను నిర్మిస్తున్నారు.సెప్టెంబర్ 28న రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేసారు.

ఈ క్రమంలోనే ఇప్పుడు దిల్ రాజు సలార్ కాంబోలో మరో సినిమా ఉండబోతుంది అని చెప్పడంతో క్రేజీగా మారింది.సలార్ తర్వాత నీల్ ఎన్టీఆర్ (NTR) తో సినిమా చేయనున్నారు.

ఈ సినిమా అనంతరం ఈ కాంబో తెరకెక్కనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube