విండోస్ 11లో ఈ కొత్త అప్‌డేట్ గమనించారా? అదుర్స్ కదూ!

కంప్యూటర్, ల్యాప్‌టాప్( Computer, laptop ) ఈ మధ్యకాలంలో గాని కొన్నారా? కొంటే మీరు ఒక విషయాన్ని మీరు గమనించే వుంటారు.వినియోగదారులకు డిఫాల్ట్‌గానే విండోస్ 11 అనేది వస్తుంది.

 Notice This New Update In Windows 11 Adurs, Computer, Laptop, Technology Updates-TeluguStop.com

అవును, విండోస్ 7, 10 ఇపుడు పాత కంప్యూటర్లలో తప్ప ఎక్కడా కనబడడంలేదు.అయితే వినియోగదారులు పాత వెర్షన్ విండోస్ పైనే ఎక్కువగా మొగ్గు చూపడం జరుగుతోంది.

ఎందుకంటే కొత్త విండోస్ వెర్షన్‌లో అనేక ఫీచర్లు ఉన్నపట్టికీ వినియోగదారులకు కొన్ని సమస్యలు వస్తున్నాయి.ముఖ్యంగా విండోస్11లో స్క్రీన్ రికార్డింగ్ సదుపాయాన్ని ఇవ్వండ్రా బాబోయ్ అంటూ ఎన్నో రోజుల నుంచి అభ్యర్థిస్తున్నారు.

Telugu Latest, Ups-Latest News - Telugu

ఈ విషయంపై మైక్రోసాఫ్ట్( Microsoft ) నుంచి ఎలాంటి రియాక్షన్ లేదు కానీ తాజాగా వచ్చిన విండోస్ 11 ( Windows 11 )అప్‌డేట్‌లో ఈ సదుపాయాన్ని కల్పించినట్లు తెలుస్తోంది.స్కిప్పింగ్ టూల్‌కు ఇచ్చిన తాజా అప్‌డేట్‌లో ఇది డిఫాల్ట్ వస్తున్నట్లు కొంతమంది వినియోగదారులు చెబుతున్నారు.అయితే మైక్రోసాఫ్ట్ ఈ విషయంపై అధికారికంగా ధ్రువీకరించాల్సి వుంది.అవును, విండోస్ 11 తాజా అప్‌డేట్‌లో స్నిప్పింగ్ చేర్చారు.మీరు విండోస్ శోధన లేదా ప్రారంభ మెనూను లాంచ్ చేయడం ద్వారా దీన్ని వాడుకోవచ్చన్నమాట.

Telugu Latest, Ups-Latest News - Telugu

ఇక దీనిని ఎలా వాడుకోవాలంటే, స్నిప్పింగ్ టూల్లో స్క్రీన్ మొత్తం లేదా ఎంచుకున్న ప్రాంతాన్ని క్యాప్చర్ చేయడానికి, అదేవిధంగా వీడియోను సేవ్ చేయడానికి రికార్డ్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.స్క్రీన్ రికార్డర్‌ను ప్రారంభించడానికి మైక్రోసాఫ్ట్ కొత్త కీబోర్డ్ షార్ట్ కట్ పరిచయం చేసింది.దానికి మీరు (Win + Shift + R)ను ప్రెస్ చేస్తే ఈ ఆప్షన్ అనేది ఎనెబుల్ అవుతుంది.

కీబోర్డ్ షార్ట్ కట్ నొక్కిన తరువాత మీరు రికార్డింగ్ స్టార్ట్ చేయబోతున్నట్టు ఓ హెచ్చరిక పాప్అప్ వస్తుంది.దాని తరువాత మీరు రికార్డ్‌పై నొక్కితే సరిపోతుంది.ఇక రికార్డింగ్‌ని ఆపడానికి స్టాప్ అనే ఆప్షన్‌ను క్లిక్ చేస్తే సరిపోతుంది.ఇది ఓ రకంగా స్క్రీన్ షాట్ తీయడం లాంటిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube