చీమలపాడు దుర్ఘటనపై స్పందించిన పవన్ కళ్యాణ్..!!

ఈరోజు ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో ఘోర అగ్ని ప్రమాదం( Chimalapadu Fire Accident ) చోటు చేసుకోవడం తెలిసిందే.BRS పార్టీ నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి సమీపంలో సిలిండర్ తేలడంతో ముగ్గురు కార్యకర్తలు మృతి చెందగా పలువురు గాయపడ్డారు.

 Pawan Kalyan Reacts To The Chimalapadu Incident Details, Brs, Pawan Kalyan, Chi-TeluguStop.com

ఈ ఘటనపై మృతుల కుటుంబాలకు 10 లక్షలు క్షతగాత్రులకు రెండు లక్షల రూపాయలు ఆర్థిక సాయం సీఎం కేసీఆర్( CM KCR ) ప్రకటించడం జరిగింది.ఇదే ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) సోషల్ మీడియాలో స్పందించారు.

చీమలపాడు దుర్ఘటన అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు.

“ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో ఈ రోజు చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం అత్యంత దురదృష్టకరం.బాణాసంచా నిప్పు రవ్వలు పడి పూరిల్లు అంటుకోవడం, ప్రమాదాన్ని నివారించే సమయంలో గ్యాస్ సిలండర్ పేలి ముగ్గురు మరణించడం, మరో పదకొండు మంది తీవ్రంగా గాయపడడం చాలా దుఃఖదాయకం.ఈ ప్రమాదం, గాయపడిన బాధితుల దృశ్యాలు భయానకంగా గోచరిస్తున్నాయి.

ప్రమాదంలో అశువులు బాసినవారి ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ, వారి కుటుంబాలకు సానుభూతి తెలియచేస్తున్నాను.ప్రాణ నష్టం పూడ్చలేనిది.మృతుల కుటుంబాలను ఆర్ధికంగా అన్ని విధాలా ఆదుకోవాలి.శరీర అవయవాలు కోల్పోయిన క్షతగాత్రులకు ప్రభుత్వం అత్యంత మెరుగైన వైద్య సహాయం అందించడంతోపాటు వారికి జీవితాంతం అండగా నిలబడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను” అంటూ పవన్ కళ్యాణ్ పోస్ట్ పెట్టడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube