ఒక పాస్టర్ పేదరికంలో ఉండే యువతులను టార్గెట్ చేసుకొని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న విషయం, మోసపోయిన యువతి బంధువులు కలెక్టర్ కు ఫిర్యాదు చేయడంతో ఎన్నో నమ్మలేని నిజాలు వెలుగులోకి వచ్చాయి.
డాక్టర్ బి.
ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా(Dr.B.R.Ambedkar Konaseema District ) అంబాజీపేట మండలం పుల్లేటి కుర్రు గ్రామంలో బెజవాడ హోసన్న అలియాస్ సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి చర్చిలో ఫాదర్ గా కొనసాగుతున్నాడు.ఈ గ్రామంలో ఓ పేదరిక యువతి తరచూ చర్చికి వచ్చేది.ఈ యువతికి చిన్న వయసులోనే తల్లి చనిపోగా తండ్రి తాగుడుకు బానిస అయ్యాడు.ఈ క్రమంలో బాలిక కూలి పనులు చేసుకుంటూ చదువు కొనసాగిస్తుంది.
</d
పాస్టర్ ఈ యువతితో పరిచయం పెంచుకొని ఆర్థికంగా సహాయం చేస్తానని పలు మీటింగ్లకు తీసుకువెళ్లడం, తన సొంత నివాసం కాకినాడకు తీసుకెళ్లి ఆ యువతీతో ఇంటి పనులు చేయించుకోవడం లాంటివి చేసేవాడు.ఆ యువతికి ఎక్కువ మొత్తంలో డబ్బులు కూడా ఇచ్చేవాడు.అయితే యువతి శరీరంలో మార్పులు గమనించిన బంధువులు ఏం జరిగిందని ప్రశ్నిస్తే పొంతనలేని సమాధానాలు చెప్పింది.
</d
దీంతో ఆ యువతికి సరోగసి( Surrogacy ) చేయించాడనే అనుమానం రావడంతో బంధువులు ఆరా తీయగా రహస్యంగా ఆ యువతిని గర్భవతి చేసి అమలాపురంలోని ఓ ఆసుపత్రిలో సిజేరియన్ చేయించి.పుట్టిన మగ బిడ్డను రూ.పది లక్షలకు అమ్మేశాడని కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.దీనిపై ఇప్పటికే అంబాజీపేట పోలీసులపై ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోలేదని బంధువులు ఆరోపించారు.
</d
యువతికి తెలియకుండా ఆమె తండ్రికి పాస్టర్ డబ్బులు ఆశ చూపించి ఈ దారుణం చేశాడని బంధువులు ఆరోపిస్తున్నారు.నిరుపేద యువతి గర్భం దాల్చడం, డబ్బులు అవసరమైనప్పుడల్లా పాస్టర్ ఆర్థిక సాయం చేయడం, దీనిపై యువతి ఇంతవరకు స్పందించకపోవడం, ఈ విషయం బయటకు వచ్చినప్పటి నుండి పాస్టర్ అజ్ఞాతంలోకి వెళ్లడంతో ఈ ఆరోపణల్లో వాస్తవం ఉందని గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు.అయితే పాస్టర్( pastor ) ను పోలీసులు సరైన రీతిలో విచారిస్తే అసలు నిజాలు ఎన్నో బయటకు వస్తాయని, చట్ట విరుద్ధమైన పనులు చేస్తున్న పాస్టర్ ను కఠినంగా శిక్షించాలని యువతి బంధువులు కలెక్టర్ హిమాన్షు శుక్లా కు ఫిర్యాదు చేశారు.







