ఆస్తుల్లో నెంబర్ ఒన్.. అభివృద్దిలో కాదు !

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి( YS Jaganmohan Reddy ) అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు.అధికారంలోకి వచ్చిన మూడేళ్లలోనే ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చమని జగన్ సర్కార్ గంటాపథం గా చెబుతున్నప్పటికి.

 Ap Cm Jagan Property Value , Ys Jaganmohan Reddy, Ap Cm Jagan, Association Of De-TeluguStop.com

ఇంకా ఎక్కడో ప్రజల్లో అసంతృప్తి కొరవడింది.ఎంతో చేశామని జగన్ సర్కార్ ఒకవైపు జబ్బలు చరుస్తుంటే.

మరి అసంతృప్తికి చొటెక్కడిది అనే డౌట్ రావోచ్చు.ప్రజల అసంతృప్తి సంక్షేమంలో కాదండోయ్.

అభివృద్దిలో.జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో జరిగిన అభివృద్ది ఏంటి అంటే ప్రతి సామాన్యుడు తెల్లమొఖం వెయ్యల్సిందే.

Telugu Ap Cm Jagan, Ap, Democratic Rems, Cm Jagan, Mamata Banerjee, Ys Jagan, Ys

యువతకు ఉద్యోగ నోటిఫికేషన్స్ విడుదల చేయడంలోనూ, రోడ్లను నిర్మించడంలోనూ, పరిశ్రమలను నెలకొల్పడంలోనూ ఇలా చెప్పుకుంటూ పోతే ఏపీలో అభివృద్ది కొరతకు సంబంధించి పెద్ద లిస్టే బయటకు వస్తుంది.ఇక మరోవైపు నిత్యవసర ధరల పెరుగుదల, బస్ చార్జీల పెంపు, ఇసుక విధానం.ఇవన్నీ కూడా సామాన్యుడిపై పెను భారంగా మారాయి.దీంతో కేవలం సంక్షేమ పథకాలు అమలు చేస్తే అభివృద్ది జరిగినట్టేనా అని సామాన్యుడు సంధించే ప్రశ్నకు జగన్ సర్కార్ వద్ద సమాధానం లేదు.

ఇదిలా ఉంచితే అభివృద్ది విషయంలో ఇంత వెనుకబడిన ఏపీ సి‌ఎం.ఆస్తులు సంపాదించుకోవడంలో మాత్రం అగ్రగామిగా దూసుకుపోతున్నారు.

Telugu Ap Cm Jagan, Ap, Democratic Rems, Cm Jagan, Mamata Banerjee, Ys Jagan, Ys

తాజాగా దేశంలోని 30 మంది ముఖ్యమంత్రుల ఆస్తులపై అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫామ్స్( Association of Democratic Reforms ) అనే సంస్థ ఓ సర్వే చేసింది.ఈ సంస్థ వెల్లడించిన ఆధారాల ప్రకారం దేశంలోని 30 మంది ముఖ్యమంత్రులలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యంత దానికి ముఖ్యమంత్రిగా టాప్ ప్లేస్ లో ఉన్నారు.జగన్ ఆస్తుల విలువ రూ.510 కోట్లు.ముగిలిన ముఖ్యమంత్రులు ఎవరు జగన్ దరిదాపుల్లో కూడా లేరు.ఇక అత్యంతా తక్కువ ఆస్తి కలిగిన సి‌ఎం గా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ( Mamata Banerjee ) ఉన్నారు.ఈమె ఆస్తుల విలువ రూ.15 లక్షలు.దీంతో ఏపీ సి‌ఎం జగన్ పై విమర్శలు పెరిగిపోతున్నాయి.ఆస్తులు పెంచుకోవడంపై చూపిస్తున్న దృష్టి రాష్ట్రాన్ని అభివృద్ది చేయడంపై చూపించాలని రాజకీయ అతివాదులు జగన్ పై మండిపడుతున్నారు.

మరి దీనిపై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube