విశాఖపట్నంలోని రుషికొండ తవ్వకాలపై ఏపీ హైకోర్టుకు నివేదిక అందింది.నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరిపారని జనసేన కార్పొరేటర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
విచారణలో భాగంగా నివేదికను కేంద్ర ప్రభుత్వ అధికారుల కమిటీ న్యాయస్థానానికి సమర్పించింది.మరోవైపు కౌంటర్ దాఖలు చేయడానికి పిటిషనర్లు సమయం కోరారు.
దీంతో హైకోర్టు తదుపరి విచారణను ఈనెల 26 కి వాయిదా వేసింది.







