War 2 : క్రేజీ అప్డేట్.. వన్ అండ్ ఓన్లీ అప్షన్ ఎన్టీఆరేనట!

ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా వ్యాప్తంగా ప్రకటించిన కొత్త సినిమాల్లో భారీ హైప్ ను క్రియేట్ చేసి పాన్ ఇండియాను షేక్ చేసిన సెన్సేషనల్ కాంబో అంటే అది యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) అండ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ అనే చెప్పాలి.ఈ ఊహించని కాంబో ప్రకటించడమే సెన్సేషనల్ అయ్యింది.

 War 2 Jr Ntr Was Aditya Chopras First And Only Choice For Hrithik Roshan Film-TeluguStop.com

ఇక ఈ కాంబో ప్రకటించినప్పటి నుండి ఒక రేంజ్ లో ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.

ఇందులో ఎన్టీఆర్ తెలుగులో సూపర్ స్టార్ అయితే హృతిక్ రోషన్ (Hrithik Roshan) బాలీవుడ్ లో సూపర్ స్టార్.మరి ఇలాంటి సౌత్, నార్త్ లను ఒక్కటి చేయాలనే ఆలోచన రావడమే ఇప్పుడు ఈ హైప్ పెరగడానికి కారణం.‘వార్ 2’ (War 2) సినిమా ఈ కాంబోలో ఉంటుంది అని బాలీవుడ్ నుండి అధికారిక ప్రకటన వచ్చిన కూడా ముందు ఎవ్వరూ కూడా నమ్మలేదు.ఇది రూమర్స్ అని కొట్టిపారేశారు.

కానీ చివరికి ఇది నిజమే అని తెలియడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు.

ఆర్ఆర్ఆర్ వంటి ప్రతిష్టాత్మకమైన సినిమాలో చరణ్ తో పాటు ఎన్టీఆర్ నటించిన ఆయన స్థాయిలో గుర్తింపు రాలేదని తారక్ ఫ్యాన్స్ బాధ పడుతున్న సమయంలో ఇలాంటి సెన్సేషనల్ ప్రాజెక్ట్ ఒకటి ప్రకటన రావడంతో నందమూరి ఫ్యాన్స్ మనసులు కాస్త కుదుట పడ్డాయి.

Telugu Aditya Chopra, Ayan Mukerji, Hrithik Roshan, Jr Ntr, Ntr Bollywood, Ntr F

అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ మొదటి ఛాయిస్ కాదని.వేరే హీరోను అనుకుని చివరికి ఎన్టీఆర్ ను తీసుకున్నారని వార్తలు వచ్చాయి.దీనిపై అందుతున్న సమాచారం ఏంటంటే.

ఈ సినిమాకు ఎన్టీఆర్ మాత్రమే వన్ అండ్ ఓన్లీ ఫస్ట్ ఛాయిస్ అని వేరే ఎవ్వరిని కూడా మేకర్స్ అనుకోలేదని.ఎన్టీఆర్ ను మాత్రమే అనుకుని ఆయనను సంప్రదించగా తారక్ ఓకే చెప్పారని ఇప్పుడు తెలుస్తుంది.

Telugu Aditya Chopra, Ayan Mukerji, Hrithik Roshan, Jr Ntr, Ntr Bollywood, Ntr F

దీంతో ఈ క్లారిటీ ఇప్పుడు వైరల్ అయ్యింది.మరి ఈ నెక్స్ట్ లెవల్ ప్రాజెక్ట్ కోసం ఇరు హీరోల ఫ్యాన్స్ ఇప్పటి నుండే ఎదురు చూస్తున్నారు.అయితే ఈ సినిమా అనౌన్స్ మెంట్ అయితే వచ్చింది కానీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.అయాన్ ముఖర్జీ (Ayan Mukerji) దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్ ను యష్ రాజ్ ఫిలిమ్స్ పై ఆదిత్య చోప్రా (Aditya Chopra) నిర్మించ బోతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube