వైరల్: క్రికెట్ ఆడడమే కాదు, మాకు సంగీతం కూడా తెలుసంటున్న దిగ్గజాలు!

వెస్టిండీస్ సూపర్ బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్( Chris Gayle ) మైదానంలోనే కాకుండా మైదానం వెలుపల కూడా చాలా సరదాగా ఉంటాడు.అద్భుతమైన బ్యాటర్ గా పేరుగాంచిన క్రిష్ గేల్, సోషల్ మీడియాలో తరచూ సందడి చేస్తూ ఉంటాడు.

 Viral Giants Who Not Only Play Cricket But Also Know Music, Cricket, Music, Play-TeluguStop.com

ఈ సీనియర్ ప్లేయర్.క్రికెట్ బ్యాట్ ఊపడంలోనే కాకుండా అందంగా కాళ్ళు తిప్పడంలో కూడా ముందుంటాడు.

అదేనండి డ్యాన్స్‌ బాగా వేస్తాడని అందరికీ తెలుసు కదా.అయితే, తాజాగా ఆస్ట్రేలియన్ మాజీ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ( Brett Lee )తో కలిసి తనకి డాన్సు చేయడమే కాకుండా పాటలు పాడడం కూడా బాగా తెలుసు అని నిరూపించాడు.

కాగా దీనికి సంబందించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.ప్రముఖ ఆస్ట్రేలియన్ క్రికెటర్( Australian cricketer ) బ్రెట్‌లీ గిటార్ వాయిస్తుంటే.క్రిస్ గేల్ పాడుతున్న వీడియో ఇపుడు ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.IPL 2023లో భాగంగా వీరిద్దరూ భారతదేశంలో ఉన్నారు.ఈ వీడియోను క్రిస్ గేల్, బ్రెట్ లీ తమ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల ద్వారా పంచుకోగా చాలామంది దానిని తిలకిస్తున్నారు.ఈ వీడియోలో బ్రెట్ లీ గిటార్ వాయిస్తుండగా, క్రిస్ గేల్ ఆ ట్యూన్‌పై పాడుతున్నట్లు చూడొచ్చు.

ఇప్పటివరకు ఈ వీడియోను 3 లక్షల మందికి పైగా లైక్ చేయడం విశేషం.ఈ వీడియోను షేర్ చేస్తూ, “గేల్, లీ కొలాబ్రేషన్”( Gale, Lee Collaboration ) అంటూ క్యాప్షన్‌ ఇవ్వడం కొసమెరుపు.కాగా వీరిద్దరి వీడియోపై చాలా మంది భారతీయులు కామెంట్స్ చేయడం గమనించవచ్చు.ఇందులో ప్రముఖ హాస్యనటుడు కపిల్ శర్మ, గాయని అదితి సింగ్ శర్మ కూడా ఉన్నారు.

కపిల్ శర్మ ‘అద్భుతం బ్రో’ అంటూ తన స్పందనను పంచుకున్నారు.కాగా అదితి సింగ్ శర్మ కామెంట్ చేస్తూ.

ఈ పాటను గేల్, బ్రెట్ లీ అధికారికంగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.ఇక యూజర్లు కామెంట్ చేస్తూ.

“గేల్ భాయ్ ఎల్లప్పుడూ మూడ్‌లో ఉంటారు” అంటూ కామెంట్ చేయడం విశేషం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube