ఒకప్పుడు మహేష్ బాబు( Mahesh Babu ) సినిమా లో నటించేందుకు కూడా డేట్లు లేవు అంటూ నో చెప్పిన రకుల్ ప్రీత్ సింగ్ ( Rakul Preet Singh )ఇప్పుడు అత్యంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుంది.తెలుగు మరియు తమిళం లో ఏడాదికి ఐదారు సినిమాల్లో నటించిన రకుల్ ప్రీత్ సింగ్ ఈ మధ్య కాలం లో అవకాశాలు లేక పోవడంతో దిక్కులు చూడాల్సిన పరిస్థితి వచ్చింది.
సౌత్ లో ఆఫర్లు తగ్గుతున్న సమయం లో అనూహ్యంగా బాలీవుడ్( Bollywood ) నుండి వరుసగా ఆఫర్లు వచ్చాయి.

రెండేళ్ల కాలం లో ఏకంగా 10 సినిమాల్లో నటించిన రకుల్ ప్రీత్ సింగ్ అందులో కనీసం ఒక్క సినిమా తో అయినా భారీ విజయాన్ని సొంతం చేసుకోలేక పోయింది.సినిమాలు సక్సెస్ కాకున్నా కనీసం తన పాత్ర తో హిందీ ప్రేక్షకుల్లో నోటెడ్ అవ్వలేక పోయింది.దాంతో రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ లో కూడా కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది.
సౌత్ లో అవకాశాలు లేకున్నా బాలీవుడ్ లో అయినా అవకాశాలు వస్తున్నాయని సంతోషించిన రకుల్ ప్రీత్ సింగ్ అభిమానులకు ఇది పెద్ద షాకింగ్ వార్త అనడంలో సందేహం లేదు.

సోషల్ మీడియా లో రకుల్ ప్రీత్ సింగ్ కి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.హాట్ ఫోటో షూట్స్ ని షేర్ చేయడం ద్వారా మళ్లీ సోషల్ మీడియా ఫాలోవర్స్ ని మాత్రమే కాకుండా ఇండస్ట్రీ వర్గాల వారిని కూడా ఆకర్షించి సినిమాల్లో అవకాశాలను దక్కించుకోవాలని రకుల్ ప్రీత్ సింగ్ ప్రయత్నాలు చేస్తోంది.హిందీ ఫిలిం మేకర్స్ ఈమెని ఇంత త్వరగా వదిలించుకుంటారని భావించలేదని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
పాపం వారు రకుల్ ని పట్టించుకోక పోవడంతో అస్సలు ఏ భాష లో కూడా సినిమా అవకాశాలు రావడం లేదని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ముందు ముందు అయినా సౌత్ లేదా నార్త్ లో రకుల్ ప్రీత్ సింగ్ మళ్లీ బిజీ అవుతుందేమో చూడాలి.







