ప్రముఖ సోషల్ మెసేజింగ్ దిగ్గజ యాప్ వాట్సాప్( WhatsApp ) రోజుకొక కొత్త అప్డేట్ తెస్తూ యూజర్లకు మంచి కిక్ ఇస్తోంది.అంతేకాకుండా మరింతమంది కొత్త యూజర్లను పోగేసుకుంటోంది.
ఇపుడు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది వినియోగదారులను ఈ యాప్ సొంతం చేసుకుంది.ఈ క్రమంలో ప్రతిఒక్కరూ చాటింగ్ కోసం, వీడియో కాల్స్ మరియు ఇతర అవసరాల కోసం వాట్సాప్ ని విరివిగా ఉపయోగిస్తూ వున్నారు.
అంతే కాకుండా రోజురోజుకీ స్మార్ట్ ఫోన్( Smart phone ) వినియోగదారుల సంఖ్యతో పాటు వాట్సాప్ వినియోగదారుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది అనడంలో సందేహమే లేదు.

ఇకపోతే తాజాగా వాట్సాప్ సంస్థ మరో సరికొత్త ఫీచర్ ని యూజర్లకు పరిచయం చేసింది.వివరాల్లోకి వెళితే.సోషల్ మీడియా యాప్స్ అయినటువంటి వాట్సాప్, ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్, మెటా సంస్థ( Facebook, Instagram, Meta company )కు చెందిన యాప్స్ అన్న విషయం అందరికీ తెలిసిందే.
ఎప్పుడైతే ఈ 3 యాప్స్ మెటా కిందకు వచ్చాయో అప్పటి నుంచి అన్ని యాప్స్ ఇక్కడ ఒకదానికొకటి అనుసంధానం చేయబడుతున్నాయి.ఇప్పటికే ఇంస్టాగ్రామ్ నుంచి పోస్టులు, కంటెంట్ ని ఫేస్ బుక్ లో కూడా షేర్ చేసే సదుపాయాన్ని కల్పించగా ఇప్పుడు ఆ ఫీచర్ ని వాట్సాప్ లోకి కూడా తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.

ఇదివరకు మీరు వాట్సాప్ లో స్టేటస్ పెడితే తర్వాత దానిని ఫేస్ బుక్ లో కూడా విడిగా పెట్టుకోవాల్సి ఉండేది.కానీ ఇప్పుడు అలాంటి అవసరం లేదు.మీరు ఒకే స్టేటస్ ఒకేసారి వాట్సాప్, ఫేస్ బుక్ లో పోస్ట్ చేసే వీలుంది.స్టేటస్ ప్రైవసీ సెట్టింగ్స్( Status privacy settings ) లో ఇప్పటివరకు మై కాంటాక్ట్స్, మై కాంటాక్ట్స్ ఎక్స్ పెక్ట్, ఓన్లీ షేర్ విత్ అని ఆప్షన్స్ ఎలా అయితే ఉన్నాయో అలాగే త్వరలో ఫేస్ బుక్ అనే ఆప్షన్ కూడా అందుబాటులోకి రానుంది.
ఆ తర్వాత మీరు ఫేస్ బుక్ అనే ఆప్షన్ ని ఎనేబుల్ చేసుకుని వాట్సాప్ లో స్టేటస్ పెడితే మీ ఫేస్ బుక్ ఖాతాలో కూడా పోస్ట్ అవుతుంది.అయితే దీనికోసం మీరు మీ ఫేస్ బుక్ ఖాతాని వాట్సాప్ అకౌంట్ కి అనుసంధానం చేయాల్సి ఉంటుంది.







