విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకమని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ఓ సెంటిమెంట్ అని పేర్కొన్నారు.
స్టీల్ ప్లాంట్ టెండర్లలో చాలా పరిమితులు ఉన్నాయని సజ్జల తెలిపారు.ఉక్కుపరిశ్రమపై సీఎం జగన్ నిర్మాణాత్మక ప్రతిపాదన చేశారన్నారు.
క్యాస్టివ్ మైన్స్ కేటాయించాలని సీఎం జగన్ కేంద్రాన్ని కోరారని చెప్పారు.ఢిల్లీ వెళ్లినప్పుడు కూడా మోదీతో సీఎం జగన్ ఇదే అంశం మాట్లాడారని స్పష్టం చేశారు.







