ఎన్టీఆర్ కు బ్రేక్ ఇచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ రీరిలీజ్ కు సిద్ధం.. ఎప్పుడంటే?

తారక్ ఫ్యాన్స్ కు( NTR Fans ) ఆయన పుట్టిన రోజు నాడు సర్ప్రైజ్ రెడీ అవుతుంది.ఇప్పుడు మన టాలీవుడ్ లో నడుస్తున్న ట్రెండ్ ఏంటి అంటే అది రీ రిలీజ్ ట్రెండ్ అనే చెప్పాలి.

 Jr Ntr Aadi Re-release Date Details, Ntr30, Ntr, Koratala Shiva, Aadi Movie, Aad-TeluguStop.com

స్టార్ హీరోల కెరీర్ లో బ్లాక్ బస్టర్ అయిన సినిమాలను మళ్ళీ ఫ్యాన్స్ కోసం నిర్మాతలు రీ రిలీజ్ చేయడం ఇప్పుడు కామన్ అయిపొయింది.ఇప్పటికే చాలా మంది స్టార్ హీరోల సినిమాలు తమ పుట్టిన రోజు నాడు రిలీజ్ అవ్వగా అన్ని కూడా మంచి కలెక్షన్స్ ను రాబట్టి మరోసారి నిర్మాతల జేబులను నింపాయి.

ఇక ఇప్పుడు ఎన్టీఆర్ (NTR) నటించిన బ్లాక్ బస్టర్ సినిమా ‘ఆది” (Aadi Movie) రీ రిలీజ్ సిద్ధం అవుతుంది.వివి వినాయక్ తెరకెక్కించిన ఈ సినిమా 2002లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.

ఎన్టీఆర్ మొదటిసారి యాక్షన్ సినిమాను చేసాడు.ఈ సినిమా మాస్ యాక్షన్ ఫ్యాన్స్ ను బాగా కట్టుకుంది.

కీర్తి చావ్లా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించారు.

Telugu Aadi, Koratala Siva, Jr Ntr, Jr Ntrs Aadis, Koratala Shiva, Ntr Adi, Ntr

ఇక బెల్లంకొండ సురేష్ అప్పట్లోనే గ్రాండ్ లెవల్లో నిర్మించారు.ఈ సినిమా సక్సెస్ అవ్వడంతో మొదటిసారి ఎన్టీఆర్ కెరీర్ కు పెద్ద బ్రేక్ ఇచ్చింది.మరి అలాంటి బ్లాక్ బస్టర్ మూవీ ఎన్టీఆర్ పుట్టిన రోజు కానుకగా రీ రిలీజ్ (Aadi Re-release) చేయబోతున్నారు మేకర్స్.

మే 20న ఈ సినిమా రిలీజ్ చేయబోతున్నట్టు పోస్టర్ ద్వారా ప్రకటించారు.ఎన్టీఆర్ పుట్టిన రోజు నాడు స్టార్ట్ అయిన ఈ సినిమా మే 28 ఎన్టీఆర్ జయంతి వరకు థియేటర్స్ లో ప్రదర్శించ నున్నారు.

Telugu Aadi, Koratala Siva, Jr Ntr, Jr Ntrs Aadis, Koratala Shiva, Ntr Adi, Ntr

చూడాలి మరి ఈ సినిమా ఎన్టీఆర్ కు మళ్ళీ ఎలాంటి హిట్ ఇస్తుందో.కలెక్షన్స్ ఎన్ని రాబడుతుందో.ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ గా వెలుగొందు తున్నాడు.ఇటీవలే ఆర్ఆర్ఆర్ వంటి ప్రతిష్టాత్మకమైన సినిమాను చేసిన ఎన్టీఆర్ ఇప్పుడు కొరటాల శివతో తన నెక్స్ట్ సినిమాను (NTR30) చేస్తున్నాడు.

ఈ సినిమాను యువసుధ ఆర్ట్స్ అండ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లపై గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.అలాగే 2024 ఏప్రిల్ 5న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube