టూవీలర్ అయినా, త్రీవీలర్ అయినా మనం ఎంతో మోజుపడి కొనుక్కుంటూ ఉంటాం.అలాంటి కారు లేదా బైక్ పైన ఏమైనా స్క్రాచెస్ పడితే మనసుకి ఎంతో బాధ కలుగుతుంది.
కొత్త వెహికల్స్( New vehicles ) కి తిరిగి పెయింటింగ్ వేయలేని పరిస్థితి వస్తుంది.పోనీ స్క్రాచెస్( Pony Scratches ) పడిన చోట మనం పెయింటింగ్ చేస్తే చాలా ఛండాలంగా తయారవుతుంది.
దాంతో టోటల్ లుక్ మారిపోతుంది.కొత్త వెహికల్ కొన్నామన్న ఆనందం ఆవిరి అయిపోతుంది.
అయితే ఇపుడు మనం సులభంగానే ఇంటి వద్ద నుంచే వాటిని తొలగించుకునే ఆప్షన్ ఒకటి అందుబాటులో ఉంది.

సాధారణంగా యూట్యూబ్‌లో చాలా వీడియోల్లో స్క్రాచెస్ ఎలా తొలగించుకోవచ్చు అనే విషయంపై చాలామంది వీడియోలు చేస్తూ వున్నారు.అవి కూడా చూడొచ్చు.అయితే ఇలాంటి టిప్స్‌లో టూత్‌పేస్ట్ కూడా ఒకటి ఉంది.మీరు కేవలం రూ.10 ఖర్చుతో టూత్ పేస్ట్ ద్వారా వెహికల్ స్క్రాచెస్‌ను తొలగించుకోవచ్చు.అయితే స్క్రాచెస్ ఏ స్థాయిలో ఉన్నాయనే అంశం మీద టూత్ పేస్ట్ ఎంత వాడాలనే అంశం ఆధారపడి ఉంటుంది.
అయితే దీని వలన పూర్తిగా స్క్రాచెస్ పోతాయని అనుకోవద్దు.ఉన్న స్క్రాచెస్ కనిపించడం మాత్రం కొంత మేర తగ్గుతుంది అని గుర్తించుకోవాలి.

అయితే కారుకు డెంట్ పడితే దాన్నితొలగించడం కష్టం.ఎందుకంటే ఆ ప్లేస్‌లో కలర్ పూర్తిగా పోయి ఉంటుంది.అయితే కలర్ పైన ఏమైనా స్క్రాచెస్ ఉంటే.
వాటిని కొంత మేర తగ్గించుకోవచ్చు.దానికోసం కోల్గేట్ లేదా ఇతర టూత్ పేస్ట్‌ను తీసుకొని దాన్ని స్క్రాచెస్‌పై రుద్దాలి.
టూత్‌పేస్ట్‌లో కాల్షియం కార్బొనేట్ ఉంటుంది కాబట్టి ఇది మరకలను తేలికగా శుభ్రం చేస్తుంది.కారు స్క్రాచెస్‌పై టూత్ పేస్ట్‌తో 2 నుంచి 3 నిమిషాలు రుద్దాలి.
తర్వాత క్లాత్‌తో దీన్ని శుభ్రం చేయాలి.స్క్రాచెస్ క్లీన్ అవుతాయి.
లేదంటే కొంత మేర స్క్రాచెస్ తగ్గుతాయి.







