రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట లో ఇటీవల గొడకూలి తల్లి కూతుర్లు చనిపోగా అట్టి సంఘటన మరవక ముందే అట్లాంటిదే మరో సంఘటన తృటిలో తప్పింది .మరో సంఘటన జరిగిన ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామపంచాయితీ పరిధిలోని కిషన్ దాస్ పేట కు చెందిన ఒగ్గు శివ కుమార్ గత 20 సంవత్సరాల క్రితం ఇల్లు కట్టుకుని కుటుంబం తో సహా నివాసముంటున్నాడు .
కాగా భవనం లో తన అన్న పిల్లలు తన పిల్లలు ఆడుకుంటుండగా వారిని అదృష్టవశత్తు పిల్లల నానమ్మ ఒగ్గు ఎల్లవ్వ పక్కన ఉన్న తన పెద్ద కుమారుడు ఒగ్గు ప్రవీణ్ ఇంట్లోకి పిలిచింది .పిల్లలు మనవిత్ ,అక్షయ్ సాత్విక్ , ,హర్షవర్ధన్ ను పిలిచింది .కాగా శివ కుమార్ ఇంట్లో ని పై కప్పు ఒక్క సారిగా ఫ్యాన్ తో సహా కుప్పకూలింది .పిల్లలు నలుగురు ప్రవీణ్ ఇంట్లోకి వెళ్లడంతో పెనుప్రమాదం జరిగేది తప్పింది .ఎలాంటి ప్రమాదం జరుగకపోవడం తో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు .సంఘటన జరిగినా సమాచారం తెలుసుకున్న మేజర్ గ్రామ పంచాయతీ ఉపసర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్ , మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ , సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి కి జరిగిన సంఘటన గురించి వివరించారు .వెంటనే అందించిన సర్పంచ్ పంచాయితీ కార్యదర్శి దేవరాజు సమాచారం ఇవ్వగా పంచాయతీ కార్యదర్శి సంఘటన స్థలాన్ని సందర్శించారు .గృహలక్ష్మి పథకం రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభిస్తే శివ కుమార్ ఇల్లు కట్టుకోవడానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ఉపసర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్ సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి ని కోరారు .