వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది ఏపీ ప్రజల సెంటిమెంట్ అని మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు.విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దన్నదే తమ స్టాండ్ అని స్పష్టం చేశారు.
స్టీల్ ప్లాంట్ అమ్మేయాలని బీఆర్ఎస్ పార్టీ అభిప్రాయపడుతుందా ప్రశ్నించిన మంత్రి అమర్నాథ్ రాజకీయాల కోసం ఏవేవో మాట్లాడుతారని చెప్పారు.ఇటువంటి వ్యాఖ్యలకు తాము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని మంత్రి అమర్నాథ్ వెల్లడించారు.







