వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం వివిధ దేశాలకు వలస వెళ్లిన భారతీయులు ఇప్పుడు కీలక స్థానాల్లో వున్న సంగతి తెలిసిందే.రాజకీయాల్లోనూ రాణిస్తూ పలు కీలక పదవులను సొంతం చేసుకుంటున్నారు.
అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా( America, Britain, Australia, Canada )లలో భారతీయుల ప్రాబల్యం ఎక్కువగా వున్న సంగతి తెలిసిందే.అక్కడి ఎన్నికల్లో అభ్యర్ధుల గెలుపొటములను మనవాళ్లే నిర్ణయిస్తున్నారు.
యూకే రాజకీయాల్లో ప్రస్తుతం భారతీయుల ప్రాబల్యం పెరుగుతున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే ఆ దేశ ప్రధానమంత్రిగా ఎన్నికై రిషి సునాక్( Rishi Sunak ) చరిత్ర సృష్టించారు.
వీరే కాకుండా ఎంపీలుగా, మేయర్లుగా రాణిస్తున్నారు.తాజాగా లీసెస్టర్ మేయర్ రేసులో ఇద్దరు భారత సంతతి అభ్యర్ధులు పోటీపడుతున్నారు.
కన్జర్వేటివ్ పార్టీ కౌన్సిలర్ సంజయ్ మోద్వాడియా, లేబర్ పార్టీ నుంచి రీటా పటేల్‌లు తలపడుతున్నారు.మోద్వాడియా ఆ ప్రాంతంలో వ్యాపారవేత్తగా గుర్తింపు తెచ్చుకున్నారు.
ప్రపంచవ్యాప్తంగా లీసెస్టర్‌కు మరింత ప్రాచుర్యాన్ని తీసుకొచ్చేందుకు గాను ఆయన ‘‘మేడ్ ఇన్ లీసెస్టర్’’( Made in Leicester ) పేరిట ప్రచారం చేస్తున్నారు.మే 4న అక్కడ మేయర్ ఎన్నికలు జరగనున్నాయి.

ఇదిలావుండగా.గతేడాది జూన్‌లో ఎల్ బ్రిడ్జ్ నగరానికి డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యారు భారత సంతతికి చెందిన చారు సూద్( Charu Sood ).ఎల్ బ్రిడ్జ్ బరో కౌన్సిల్‌లో వరుసగా రెండోసారి ఆమె కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు.2018లో ఇదే స్థానం నుంచి తొలిసారిగా ఎన్నికైన చారు సూద్ మంచి పనితీరు కనబరిచారు.ఎల్ బ్రిడ్జ్‌లోని కన్జర్వేటివ్ పార్టీ ( Conservative Party in El Bridge )స్టార్ క్యాండిడేట్స్‌లో ఆమె కూడా ఒకరు.అంతేకాదు తిరిగి వారి స్థానాలను నిలబెట్టుకోగలిగిన కొద్దిమందిలో చారు సూద్ వున్నారు.
ఎన్నికల్లో కన్జర్వేటివ్‌లు సత్తా చాటని సందర్భంలోనూ ఆమె స్పష్టమైన మెజారిటీతో విజయం సాధించారు.చారు సూద్ విజయం పట్ల ఆమె తండ్రి శశిభూషణ్ సూద్ హర్షం వ్యక్తం చేశారు.
వీరి కుటుంబం ఇప్పటికీ చండీగఢ్‌లోనే నివసిస్తోంది.వరుసగా రెండవసారి ఎన్నికైన అతి పిన్న వయస్కులలో చారుసూద్ కూడా ఒకరని ఆయన అన్నారు.
చండీగఢ్‌లో పాఠశాల విద్యను పూర్తి చేసిన ఆమె తొలుత బార్సిలోనాకు అనంతరం యూకేకు వెళ్లారు.







