సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలోని నారాయణ ఉన్నత పాఠశాలలో కిడ్స్ విద్యార్థులు తమ కోర్సు పూర్తి చేసుకుని ఈ చామ్స్ కు వెళ్తున్న సందర్భంగా సోమవారం పాఠశాలలో ఏర్పాటు చేసిన గ్రాడ్యుయేషన్ డే కు సిఐ రాజశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నారి విద్యార్థినీ విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు వేదికపై ప్రదర్శించిన విధానం తనను ఎంతగానో ఆకట్టుకున్నాయన్నారు.
విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మక వెలికి తీయడం కోసం కృషి చేస్తున్న ఉపాధ్యాయుని ఉపాధ్యాయులను పాఠశాల ప్రిన్సిపాల్ ను అభినందించారు.ఈ కార్యక్రమంలో ఏజీఎం దొంతిరెడ్డి వెంకటరమణ రెడ్డి మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులు అలాంటి బాలలకు తొలిమెట్టైనా ఈ కిడ్స్ లో మంచి శిక్షణపై తరగతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.
భవన నిర్మాణానికి పునాది ఎంత ముఖ్యమో ఒక పాఠశాల విద్యా ప్రగతి అభివృద్ధి చెందడానికి కిడ్స్ అంతే ముఖ్యమన్నారు.ఇట్టి కార్యక్రమంలో ఆర్ఐ గుత్తికొండ రమేష్ రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పి.పుష్పలత,ఉప ప్రధానోపాధ్యాయురాలు ఉదయశ్రీ,పాఠశాల కోఆర్డినేటర్స్ సింధు,6 హిమబిందు,పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు పలువురు పాల్గొన్నారు.