తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి.రోడ్లపై అడుగుపెట్టాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది.
మరోవైపు థియేటర్లలో సైతం చెప్పుకోదగ్గ సినిమాలు లేవు.గత శుక్రవారం విడుదలైన రావణాసుర, మీటర్ సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి ఫ్లాప్ కావడంతో ఈ వారం విడుదలవుతున్న సినిమాలపై భారీ స్థాయిలో అంచనాలు అయితే ఏర్పడ్డాయి.ఏప్రిల్ రెండో వారం రిలీజవుతున్న సినిమాలలో శాకుంతలం సినిమాపై( Shaakuntalam ) భారీగా అంచనాలు నెలకొన్నాయి.
80 కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది.బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందో చూడాల్సి ఉంది.సమంత ఈ సినిమాపై చాలానే ఆశలు పెట్టుకున్నారు.లారెన్స్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన రుద్రుడు సినిమా( Rudrudu ) కూడా అదే తేదీన రిలీజ్ కానుండగా ఈ సినిమాపై ప్రేక్షకుల్లో పెద్దగా అంచనాలు లేవు.పాజిటివ్ టాక్ వస్తే మాత్రం ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునే ఛాన్స్ అయితే ఉంటుంది.

సూరి, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన విడుదల పార్ట్1 సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.ఈ సినిమా బాక్సాఫీస్ ను ఏ రేంజ్ లో షేక్ చేస్తుందో చూడాలి.రవిబాబు, పూర్ణ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన అసలు మూవీ( Asalu ) ఈటీవీ విన్ లో 13వ తేదీన స్ట్రీమింగ్ కానుంది.ఓటీటీల విషయానికి వస్తే ఆహా ఓటీటీలో ఈ నెల 14వ తేదీన దాస్ కా ధమ్కీ స్ట్రీమింగ్ కానుంది.
ఎం.ఎక్స్ ప్లేయర్ లో ది సాంగ్ ఆఫ్ గ్లోరీ హిందీ సిరీస్ స్ట్రీమ్ కానుంది.

హాట్ స్టార్ లో ఓ కల, టైనీ బ్యూటిఫుల్ థింగ్స్ ఈ వారం స్ట్రీమింగ్ కానున్నాయి.జీ5లో మిస్సెస్ అండర్ కవర్ హిందీ సిరీస్ స్ట్రీమ్ కానుంది.అమెజాన్ ప్రైమ్ లో ది మార్వెలస్ మిస్సెస్ వెబ్ సిరీస్ స్ట్రీమ్ కానుందని బోగట్టా.14వ తేదీన ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.నెట్ ఫ్లిక్స్ లో ఫ్లోరియా మాన్ వెబ్ సిరీస్, అబ్సెషన్ వెబ్ సిరీస్, క్వీన్ మేకర్ కొరియన్ సిరీస్, ది లాస్ట్ కింగ్ డమ్ స్ట్రీమింగ్ కానున్నాయి.13, 14 తేదీలలో ఈ సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయి.







