బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం హాస్యాస్పదంగా ఉందని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లు ఉందని ఎద్దేవా చేశారు.
సభ్యుడినే కాదన్న బీఆర్ఎస్ అధిష్టానం తనను ఇవాళ పార్టీ నుంచి ఎలా సస్పెండ్ చేసిందని పొంగులేటి ప్రశ్నించారు.బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన ఈ ఎనిమిదిన్నర ఏళ్లలో ఏం చేశారని ప్రశ్నించారు.
నీళ్లు, నిధులు, నియామకాలపై తెలంగాణ వచ్చిందన్న ఆయన బంగారు తెలంగాణ చేస్తామని ఏం చేశారో చెప్పాలన్నారు.సుమారు వంద రోజులుగా ప్రశ్నిస్తూనే ఉన్నానని చెప్పారు.
ఇప్పటికైనా ధైర్యం వచ్చి తనను సస్పెండ్ చేసినందుకు ప్రశంసిస్తున్నట్లు వెల్లడించారు.







