మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలపై బీఆర్ఎస్ పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది.పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని సస్పెండ్ చేసిందని తెలుస్తోంది.
అయితే నిన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో పొంగులేటి నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి జూపల్లి హాజరైన సంగతి తెలిసిందే.అంతేకాకుండా ఈ ఇద్దరు నేతలు గత కొంతకాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి చేయడం లేదని విమర్శలు చేశారు.ఈ నేపథ్యంలోనే జూపల్లి, పొంగులేటిపై పార్టీ సస్పెన్షన్ వేటు వేసిందని తెలుస్తోంది.
దీంతో ఖమ్మం రాజకీయాలు మరింతగా వేడెక్కాయని చెప్పొచ్చు.







