నిజమో కాదో తెలియదు కానీ టాలీవుడ్ జక్కన్న రాజమౌళి తన ఆర్ఆర్ఆర్( RRR ) సినిమా ప్రమోషన్ కి భారీ ఎత్తున ఖర్చు చేశాడు అనే ప్రచారం జరిగింది.ముఖ్యంగా ఆస్కార్ ప్రమోషన్ కార్యక్రమాల కోసం దాదాపుగా 80 కోట్ల రూపాయలను ఖర్చు చేశాడు అనే ప్రచారం జరుగుతోంది.
ఆస్కార్ పబ్లిసిటీ( Oscar award ) కోసమే దర్శకుడు రాజమౌళి ఏకంగా 80 కోట్ల రూపాయలను ఖర్చు చేశాడని.ఆ 80 కోట్ల రూపాయలు తనకి ఇస్తే పది సినిమాలు తీసి మొహాన కొట్టేవాడిని అంటూ తమ్మారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆ మధ్య సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే.
ఇప్పుడు పుష్ప సినిమా కు కూడా అదే ఫార్ములా ఫాలో అవ్వాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.అతి త్వరలోనే పుష్ప సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేయబోతున్నారట.
ఇప్పటికే వీడియో ను విడుదల చేసి, పోస్టర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి సర్ప్రైజ్ చేసిన పుష్ప యూనిట్ సభ్యులు మరింత జోరుగా ప్రచారాన్ని చేయబోతున్నారు.

సినిమా ను ఎంత క్రియేటివిటీగా తెరకెక్కిస్తున్నారో అంతే క్రియేటివిటీ తో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయానికి వచ్చారు.అందుకోసం ఏకంగా వంద కోట్ల రూపాయలను ఖర్చు చేయాలని భావిస్తున్నారు.అంతే కాకుండా విదేశాల్లో కూడా పుష్ప 2 ను ప్రమోషన్ చేయడం కోసం భారీగా ఖర్చు చేస్తున్నారట.
మొత్తానికి పుష్ప 2 పబ్లిసిటీ( Pushpa 2 ) కోసం 100 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

రూ.100 కోట్లు ఖర్చు చేస్తే కచ్చితంగా అంతకు మించి ప్రయోజనం ఉంటుందని చిత్ర యూనిట్ సభ్యులు భావిస్తున్నారట.ఈ సినిమా వెయ్యి కోట్ల కలెక్షన్ టార్గెట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
కనుక వంద కోట్ల బడ్జెట్ తో పబ్లిసిటీ కార్యక్రమాలు అనేది తప్పేం కాదు అంటూ కొందరు సినిమాను తీయడం కంటే ప్రచారం చేయడం ముఖ్యం కనుక సుకుమార్ టీం తీసుకున్నాను అభినందించాల్సిందే అంటూ కొందరు అభిప్రాయం చేస్తున్నారు.అయితే ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ఖర్చు చేసినట్లుగా ఈ సినిమా ఖర్చు చేస్తే ఎంత వరకు వెనక్కు వస్తాయి అనేది క్లారిటీ లేదు అంటూ కొందరు అభిప్రాయం చేస్తున్నారు.







