వేసవి, పైగా పెళ్లిళ్ల సీజన్ కావడంతో సోషల్ మీడియాలో( Social Media ) వీటికి సంబందించిన వీడియోలు ఎక్కువగా దర్శనం ఇస్తున్నాయి.అందులో కొన్ని తెగ వైరల్ అవుతున్నాయి.
వివాహ వేడుకలో వధువు, వరుడి ( Bride Groom ) తరువాత అత్యంత ప్రాముఖ్యత ఉన్న వ్యక్తి పూజారి ( Priest ) అని చెప్పుకోవచ్చు.ఎందుకంటే పురోహితుడు లేనిదే పెళ్లి తంతు లేదు.
వేద మంత్రాల సాక్షిగా ఆ జంటను ఒక్కటి చేసేది అతడు మాత్రమే.ఈ క్రమంలో వివాహ వేడుకలో భాగంగా జరిగే ప్రతి క్రతువుకు ఓ అర్థం పరమార్థం అనేది ఉంటుంది.
కొందరు పురోహితులు దంపతులకు వాటి అర్థాలను కూడా వివరిస్తారు.

తాజాగా జరిగిన ఓ వివాహంలో పురోహితుడు వరుడికి చేసిన ఓ సూచన విని వధువు సంబరంతో కిందామీదా పడిపడి నవ్వింది.ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారగా వెలుగు చూసింది.శుభవివాహ్ అనే ఇన్‌స్టా అకౌంట్లో తొలిసారిగా దర్శనమిచ్చిన ఆ వీడియో ప్రస్తుతం నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంది.
ఆ పెళ్లిలో పురోహితుడు వధూ వరులకు ఏడడుగుల క్రతువుకున్న విశిష్టతను వివరిస్తాడు.

అక్కడి వరకు బాగానే వుంది కానీ, ఆ తరువాత ఆ పురోహితుడు ట్విస్ట్ ఇస్తాడు.పూజారి వరుడిని ఉద్దేశించి ‘మీ సంపాదించిందంతా మీ భార్య చేతుల్లోనే పెట్టాలి’ అంటూ ఒక్క లైన్లో భర్త బాధ్యత సరదాగా చెబుతాడు.దాంతో సంబర పడిపోయిన వధువు పెద్ద పొలికేక పెట్టి మరీ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది.
వరుడు కూడా ఆ మాటలకు నవ్వాపుకోలేక పెళ్లికూతురివైపు కొంటెగా చూస్తాడు.కాగా వధూవరులిద్దరూ నవ్వుకున్న దృశ్యం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.ఇక ఈ వీడియోని తిలకించిన నెటిజన్లు ఎవరికి తోచినట్టు వారు కామెంట్ల వరద కురిపిస్తున్నారు.మరెందుకాలస్యం, ఈ వీడియోపై మీరు ఓ లుక్కేయండి మరి.







