ఈ ఐపీఎల్ సీజన్ ద్వారా ఢిల్లీ కెప్టెన్ డేవిడ్ వార్నర్( David Warner ) 6వేల పరుగులు పూర్తి చేసి, అత్యధిక పరుగులు చేసిన మొదటి విదేశీ ఆటగాడిగా సరికొత్త రికార్డు సృష్టించాడు.ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన మూడవ ఆటగాడిగా డేవిడ్ వార్నర్ నిలిచాడు.
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసి మొదటి స్థానంలో విరాట్ కోహ్లీ నిలిచాడు.బెంగుళూరు జట్టు తరుపున ఆడుతున్న కోహ్లీ 188 మ్యాచ్లలో 6000 వేల చేశాడు.
ఐపీఎల్ లో విరాట్ కోహ్లీ( Virat Kohli ) మొత్తం 225 మ్యాచ్లలో 217 ఇన్నింగ్స్ లలో ఆడి 6727 పరుగులు చేశాడు.
తర్వాత పంజాబ్ జట్టుకు కెప్టెన్ గా బాధ్యతలు వ్యవహరిస్తున్న శిఖర్ ధావన్ అత్యధిక పరుగులు చేసిన వారి జాబితాలో రెండవ స్థానంలో నిలిచాడు.
శిఖర్ ధావన్ 199 ఇన్నింగ్స్ లలో 6000 పరుగులు చేశాడు.ఇక ఐపీఎల్ చరిత్రలో 208 మ్యాచ్లలో 207 ఇన్నింగ్స్ లలో ఆడి 6370 పరుగులు చేశాడు.ఇక డేవిడ్ వార్నర్ విషయానికి వస్తే ఇతను 2009లో ఐపీఎల్ కి ఎంట్రీ ఇచ్చాడు.165 మ్యాచ్లలో 165 ఇన్నింగ్స్ లలో ఆడి 42.33 సగటుతో, 140.04 స్ట్రైక్ రేట్ తో 6039 పరుగులు చేశాడు.ఇందులో నాలుగు సెంచరీలు, 56 అర్థ సెంచరీలు ఉన్నాయి.డేవిడ్ వార్నర్ అత్యుత్తమ స్కోరు 126 పరుగులు.ప్రస్తుతం డేవిడ్ వార్నర్ ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన మూడవ ఆటగాడిగా, తొలి విదేశీ ఆటగాడిగా నిలిచాడు.

ప్రస్తుతం డేవిడ్ వార్నర్ ఢిల్లీ జట్టుకు కెప్టెన్ గా( Delhi Capitals ) వ్యవహరిస్తున్నాడు.అయితే ఢిల్లీ జట్టు మూడు హ్యాట్రిక్ ఓటములను ఖాతాలో వేసుకొని లీగ్ పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిలిచింది.జట్టు ఆటగాళ్లు బౌలింగ్ లోను, బ్యాటింగ్ లోను ఆట ప్రదర్శన లో మార్పు రాకపోతే చాలా కష్టం.
ఈ సమయంలో జట్టు మెరుగుపడాల్సిన అవసరం ఉంది.







