'రావణాసుర' ఈ రోజు మిస్ అయితే కష్టమేనా.. రెండోరోజు దారుణమైన కలెక్షన్స్!

మాస్ మహారాజా రవితేజ ( Ravi Teja ) గత రెండు సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్నాడు.ధమాకా, వాల్తేరు వీరయ్య వంటి సినిమాలతో చాలా రోజుల తర్వాత వరుస హిట్స్ తన ఖాతాలో వేసుకున్నాడు.

 ‘ravanasura’ Box-office Collections Day 2, Ravanasura, Ravi Teja, Sudhir Ve-TeluguStop.com

ఇక ఈ సినిమా తర్వాత మాస్ రాజా నుండి వచ్చిన నెక్స్ట్ మూవీ ”రావణాసుర”( Ravanasura ) . ఈ సినిమాతో ఎలాగైనా హ్యాట్రిక్ హిట్ అందుకోవాలని ఆశ పడ్డ రవితేజకు మరో ప్లాప్ ఎదురైంది.

తాజాగా రవితేజ హీరోగా సుధీర్ వర్మ ( Sudhir Verma) దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ అవైటెడ్ మూవీ ‘రావణాసుర’.ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురు చూసారు.

మరి అందరి ఎదురు చూపుల మధ్య ఈ సినిమా ఏప్రిల్ 7న పాన్ ఇండియా వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.

ఇక ఈ సినిమాలో మాస్ రాజాకు జోడీగా ఐదుగురు హీరోయిన్స్ నటించారు.అను ఇమ్మాన్యుయేల్, పూజిత పొన్నాడ, దక్షా నాగర్కర్, ఫరియా అబ్దుల్లా, మేఘ ఆకాష్ లు నటించగా.హర్ష వర్ధన్, భీమ్స్ సిసిరోలియా సంగీతం అందించారు.

అక్కినేని హీరో సుశాంత్ ఈ సినిమాలో విలన్ రోల్ లో కనిపించి ఆకట్టు కున్నాడు.ఈ సినిమా మరీ యాక్షన్ ఎక్కువ కావడంతో ఫస్ట్ డే నుండే మిక్సెడ్ టాక్ వచ్చింది.

అయితే మొదటి రోజు ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ ( Ravanasura Box Office Collections) నే అందుకుందని తెలిసింది.మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 4 కోట్ల 29 లక్షలను రాబట్టిన ఈ సినిమా రెండవ రోజు కేవలం 2 కోట్లతోనే సరిపెట్టుకుంది.రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 6 కోట్ల 54 లక్షల షేర్ రాబట్టగా 10.75 కోట్ల గ్రాస్ రాబట్టింది.ప్రపంచ వ్యాప్తంగా అయితే 7.80 కోట్ల షేర్ రాబట్టగా 13.70 గ్రాస్ రాబట్టింది.వీకెండ్ ఏమైనా వసూళ్లు వస్తే తప్ప గట్టెక్కడం కష్టమేనని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube