ఐపీఎల్ లో బలమైన జట్లలో ముంబై జట్టుకు ప్రత్యేక స్థానం ఉంది.అయితే ఈ సీజన్లో అట్టర్ ప్లాప్ దిశగా చెత్తగా ఆడుతూ అభిమానులను నిరాశ పరుస్తోంది.
ఆడిన రెండు మ్యాచ్లలో ఘోర ఓటములను ఖాతాలో వేసుకుంది.జట్టులో బలమైన బ్యాటర్లు ఉన్న.
ఘోర పరాజయాలు నమోదు కావడంపై స్పందిస్తూ ముంబై జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ( Rohit Sharma ) కీలక వ్యాఖ్యలు చేశాడు.ముంబై జట్టులో బ్యాటర్లైన ఇషాన్ కిషన్, సూర్య కుమార్ యాదవ్( Surya Kumar Yadav ), కామెరున్ గ్రీన్, రోహిత్ శర్మలు పూర్తిగా విఫలం అయ్యారు.
జరిగిన రెండు మ్యాచ్లలో ఈ బ్యాటర్లు ఎక్కువసేపు క్రీజులో కూడా నిలబడలేకపోయారు.దీనిపై స్పందించిన రోహత్ శర్మ తనతో పాటు మిగతా ఆటగాళ్లు కూడా బాధ్యత తో జట్టుకు విజయాలు తీసుకురావాల్సిన అవసరం ఉందని.
ఆట ప్రదర్శనలో అనేక మార్పులు జరగాలని తెలిపాడు.

సీనియర్ ఆటగాళ్లు కాస్త దూకుడుగా, ధైర్యంగా ఆడితేనే జట్టు రాణించ గలుగుతుందని, కేవలం రెండు మ్యాచ్లే జరిగాయని ఏ ఆటగాడు కూడా ఆధైర్య పడకుండా.సమర్థవంతంగా రాణించాలని తెలిపాడు.తాను కూడా తర్వాత జరిగే మ్యాచ్లలో మెరుగుగా ఆడతానని, ఒక్కసారి విజయం సాధిస్తే వరుస విజయాలు చేరువవుతాయని కీలక వ్యాఖ్యలు చేశాడు.

చెన్నై తో జరిగిన మ్యాచ్లో( Chennai Super Kings ) తాము కాస్త దారి తప్పమని, ఒత్తిడికి లోను కావడం వల్లే పెద్దగా స్కోరు నమోదు చేయలేకపోయామని తెలిపాడు.ఈ మ్యాచ్ లో మరో 40 పరుగులు చేసి ఉంటే పరిస్థితులు వేరేలా ఉండే అవకాశం ఉండేది.ఇంకొన్ని విషయాలలో సరైన నిర్ణయాలు తీసుకోవలసిన అవసరం ఉందని రోహిత్ శర్మ తెలిపాడు.ప్రస్తుతం ముంబై జట్టు ఏప్రిల్ 11న జరిగే మ్యాచ్లో ఢిల్లీపై విజయం సాధించి, మొదటి విజయాన్ని ఖాతాలో వేసుకోవాలని భావిస్తోంది.







