ఏపీ అధికార పార్టీ వైకాపా వచ్చే ఎన్నికల్లో కూడా విజయాన్ని దక్కించుకునేందుకు పలు ప్రయత్నాలు చేస్తుంది.అందులో భాగంగానే జగనన్నే మా భవిష్యత్తు అనే కార్యక్రమాన్ని జనాల్లోకి తీసుకు వెళ్లేందుకు సిద్ధమయింది.
గ్రామాల్లో పట్టణాల్లో ప్రతి ఇంట్లో కూడా జగనన్న పథకాల గురించి వివరిస్తూ వారికి జగన్(jagan ) అన్న మన భవిష్యత్తు అన్నట్లుగా భరోసాని కలిగించే కార్యక్రమాన్ని వైకాపా మొదలు పెట్టింది.అధికార పార్టీ యొక్క పథకాలన్నింటినీ వివరిస్తూ ముందుకు సాగాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు.
అంతే కాకుండా రాబోయే ఎన్నికల్లో గెలిచిన తర్వాత చేయబోతున్న పనులను కూడా ప్రజలకు వివరంగా తెలియజేయాలని ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు.భారీ ఎత్తున జగనన్నే మన భవిష్యత్తు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు జనసేన పార్టీ నాయకులు కౌంటర్ గా పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

జనసేన పార్టీ కార్యకర్తలు తిరుపతిలో పవన్( Pawan ) మన భవిష్యత్తు కార్యక్రమాన్ని నిర్వహించారు.పవన అధికారంలోకి రావడం వల్ల కలిగే ఉపయోగాలు, జగన్ మరోసారి సీఎం గా ఉంటే వచ్చే నష్టాల గురించి జనసేన పార్టీ కార్యకర్తలు మరియు నాయకులు వివరిస్తూ ముందుకు సాగుతున్నారు.వైకాపా మరియు జనసేన పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమానికి జనసేన( Janasena ) కార్యక్రమం కౌంటర్ అంటూ సాగుతున్న నేపథ్యంలో రెండు పార్టీల నాయకుల మరియు కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
దీంట్లో ఎవరిని ఎవరు కించపరిచినట్లు కాదని చెప్పే ప్రయత్నం చేసినా కూడా పోలీసుల రంగ ప్రవేశం చేసే వరకు గొడవ సర్దుమనగలేదు.మొత్తానికి ఎన్నికలు ఇంకో సంవత్సరం ఉండగానే యుద్ధ వాతావరణం కనిపిస్తున్న నేపథ్యంలో ఎన్నికలు వచ్చేప్పటికి పరిస్థితి ఎలా ఉంటుందో అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
దేశం మొత్తం కూడా ఆ సమయంలో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి, కనుక బిజెపి కూడా ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం చూపించాలని బిజెపి మా భవిష్యత్తు అంటూ ఓ కార్యక్రమాన్ని మొదలు పెడుతుందేమో అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.







