ఒక డైరెక్టర్ ఒక సినిమా తీసి మంచి విజయం అందుకుంటే ఆ తరువాత కూడా ఆ ప్రొడక్షన్ హౌజ్ లోనే ఇంకో సినిమా చేస్తూ ఉంటారు అలాంటి వాళ్లు ఇండస్ట్రీ లో చాలా మందే ఉన్నారు.వారెవరో ఒకసారి తెలుసుకుందాం… పటాస్ సినిమాతో బ్లాక్బస్టర్ హిట్ కొట్టిన డైరెక్టర్ అనిల్ రావిపూడి ( Director Anil Ravipudi )తన సెకండ్ సినిమా గా దిల్ రాజు ప్రొడ్యూసర్ గా సుప్రీమ్( Supreme ) సినిమా తీశాడు.
ఇది కూడా సూపర్ హిట్ అవ్వడం తో ఇక వరుసగా రాజా ది గ్రేట్,f2, సరిలేరు నికెవ్వరు,f3 లాంటి సినిమాలు చేశాడు.ప్రస్తుతం ఇప్పుడు బాలయ్య సినిమా కోసం బయటికి వచ్చి వేరే ప్రొడ్యూసర్స్ తో సినిమా చేస్తున్నాడు….
షైన్ స్క్రీన్స్ లో అనిల్ రావిపూడి – బాలయ్య సినిమా రూపొందుతోంది.

ఇక అనిల్ రావిపూడి లానే మరో దర్శకుడు కూడా ఓ బ్యానర్ లో లాక్ అయిపోయాడు.ఆయనే త్రివిక్రమ్ శ్రీనివాస్( Trivikram Srinivas ) ఆయన చేసిన చాలా సినిమాలు హారిక హాసిని క్రియేషన్స్( Harika Hasini Creations ) లోనే ఉంటాయి.ప్రస్తుతం మహేష్ బాబు తో చేసే సినిమా కూడా వాళ్ల బ్యానర్ లోనే రూపొందుతుంది… ఇక వీళ్లే కాకుండా ఒకే బ్యానర్ లో సినిమాలు చేస్తున్న డైరెక్టర్ ఇంకొకరు ఉన్నారు ఆయనే వెంకీ అట్లూరి( Venky Atluri )… తొలిప్రేమ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన ఇతను అటు తర్వాత మిస్టర్ మజ్ను , రంగ్ దే సినిమాలను కూడా తెరకెక్కించాడు.
అయితే ఇందులో తొలిప్రేమ హిట్ అయ్యింది… మిస్టర్ మజ్ను ఫ్లాప్, రంగ్ దే యావరేజ్ గా నిలిచాయి.రంగ్ దే చిత్రాన్ని ఇతను సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో సూర్య దేవర నాగ వంశీ నిర్మాణంలో చేశాడు.

వెంటనే ఇదే బ్యానర్లో ధనుష్ తో సార్ అనే సినిమా చేశాడు.ఇది ద్విభాషా చిత్రం.ఫిబ్రవరిలో రిలీజ్ అయిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ అయ్యింది.సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో రూపొందిన ఈ చిత్రం బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.అందుకే ఇప్పుడు ఈ దర్శకుడితో మళ్లీ సినిమా చేయడానికి రెడీ అయ్యింది ఈ సంస్థ… వెంకీ అట్లూరి పుట్టినరోజు సందర్భంగా ప్రొడ్యూసర్ నాగ వంశీ ఆయనకి బర్త్ డే విషెస్ చెబుతూ ఆయన నెక్స్ట్ సినిమా కూడా మా బ్యానర్ లోనే ఉండబోతుంది అంటూ కన్ఫర్మ్ చేశారు…
.







