మెగా పవర్ స్టార్ రామ్ చరణ్( Ramcharan ) ఉపాసన ( Upasana) దంపతులు ప్రస్తుతం ఎంతో సంతోషంలో ఉన్నారు.పెళ్లి తర్వాత పది సంవత్సరాలకు ఈ దంపతులు తల్లిదండ్రులు( Parents ) కాబోతున్న నేపథ్యంలో ఎంత సంతోషంగా గడుపుతున్నట్టు తెలుస్తుంది.
సాధారణంగా కడుపుతో ఉన్నవారికి ఎన్నో కోరికలు ఉంటాయి అంటారు.ఇలాంటి సమయంలో తన భర్త పక్కన ఉండాలని ప్రతి భార్య కోరుకుంటుంది.
ఈ క్రమంలోనే రామ్ చరణ్ సైతం తన భార్య పక్కనే ఉంటూ తనను విదేశీ పర్యటనలకు తీసుకెళ్తూ తన కోరికలు మొత్తం తీర్చితున్నట్టు తెలుస్తుంది.
ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ ( Game Changer )సినిమా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విషయం మనకు తెలిసిందే.అయితే శంకర్ (Shankar)ప్రస్తుతం ఇండియన్ టు( Indian 2 ) సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్న నేపథ్యంలో చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి పలు వెకేషన్ లకు వెళుతూ ఎంజాయ్ చేస్తున్నారు.ఈ క్రమంలోనే ఇన్ని రోజులు దుబాయ్ (Dubai)పర్యటనలో ఉన్నటువంటి ఈ జంట తాజాగా మాల్దీవులకు( Maldives ) వెళ్లినట్టు తెలుస్తుంది.
సమక్షంలో సీమంతం జరుపుకున్నటువంటి ఉపాసన దుబాయ్ నుంచి నేరుగా మాల్దీవులకు వెళ్లారు.
ఈ క్రమంలోనే ఎయిర్ కోర్టులో రామ్ చరణ్ దంపతులు సందడి చేశారు.ఇలా ఎయిర్ పోర్టులో ఉపాసన రాంచరణ్ చాలా స్టైలిష్ లుక్ లో కనిపించారు .ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇకపోతే శంకర్ ఇండియన్ 2 షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకున్న అనంతరం గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ పనులలో జాయిన్ అవుతారు.అంతలోపు చరణ్ కూడా తన వెకేషన్ ముగించుకొని ఈ సినిమా షూటింగ్ పనులలో బిజీ కానున్నారు.