స్మార్ట్ ఫోన్స్ వినియోగం పెరిగాక సోషల్ మీడియాకి మంచి గిరాకీ ఏర్పడింది.ఇక్కడ పదిమందిలో 9 మంది నిత్యం సోషల్ మీడియాలోనే వుంటున్నారని సర్వేలు చెబుతున్నాయంటే ఇక అర్ధం చేసుకోండి.
దాంతో ప్రపంచం నలుమూలలా జరుగుతున్న వింతలువిశేషాలను మనం చాలా తేలికగా తెలుసుకోగలుగుతున్నాం.సగటున రోజుకి సోషల్ మీడియాలో లక్షల కొలది వీడియోలు అప్లోడ్ అవుతూ ఉంటాయి.
అయితే అందులో ఏ కొన్నో వైరల్ అవుతుంటాయి.అందులో కొన్ని ఫన్నీగా ఉంటే, మరికొన్ని ఆశ్చర్యంగా ఉంటాయి.
కొన్ని చిత్రంగా ఉంటే మరికొన్ని జగుప్సను కలిగిస్తూ ఉంటాయి.
తాజాగా ఈ కోవకు చెందిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కెర్లు కొడుతోంది.సాధారణంగా ఒక్కో ప్రాంతాన్ని బట్టి ఆహారపు అలవాట్లలో వ్యత్యాసం అనేది ఉంటుంది.ఈ క్రమంలోనే స్థానిక రుచులు, వంటల ప్రయోగాలు, ఆహార ప్రియులు తయారు చేసే కొత్త కొత్త వంటకాలకు సంబంధించిన వీడియోలు తరచూ ఇక్కడ వైరల్ అవుతుంటాయి.
విద్యా రవిశంకర్ అనే యువ వ్లాగర్ ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలో ప్రయాణించగా అక్కడ ఆమె ఒక వింత వంటకం గురించి తెలుసుకుంటుంది.అదేమంటే చీమలతో చేసిన చట్నీ.
వినడానికే వింతగా వుంది కదూ.ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని ఒక తెగకు చెందిన ప్రజలు చీమలతో చట్నీ చేసుకుని తింటారు.
ఇక్కడి ప్రజలు చెట్లమీద గూడుకట్టుకున్న చీమలను సేకరిస్తారు.ఆ తర్వాత చీమలను దంచి ప్రత్యేక పద్ధతిలో చట్నీని తయారుచేస్తారు.ఇక వీడియోలో విద్య కూడా ఆ చట్నీని రుచి చూడడం గమనించవచ్చు.దీనిని చూసిన నెటిజన్లు ఈ వీడియోకి కామెంట్స్ మీద కామెంట్స్ చేస్తున్నారు.ఆ ఆహార పదార్ధాన్ని చూడలేకపోతున్నామని కొందరు చెబుతుంటే, మరికొందరు ప్రయాణం చేసి అలాంటి అనుభవాలను షేర్ చేసినందుకు ఆమెకి థాంక్స్ చెబుతున్నారు.కాగా ఈ వీడియోకు 5.9 మిలియన్లకు పైగా వ్యూస్, 219K లైక్‌లు, వేలకొద్దీ కామెంట్స్ రావడం కొసమెరుపు.