ఒకేసారి పవర్ స్టార్, డార్లింగ్ ఫ్యాన్స్ కు బిగ్ ట్రీట్.. వారి మూవీ అప్డేట్స్ అలా ఇచ్చి..

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory) వారు ఈ మధ్య కాలంలో వరుస సినిమాలను నిర్మిస్తున్నారు.ఒకవైపు చిన్న చిన్న సినిమాలను నిర్మిస్తూనే మరో వైపు భారీ బడ్జెట్ సినిమాలను కూడా నిర్మిస్తున్నారు.

 People Media Gets Updates On Pawan Kalyan And Prabhas Movies Details, Prabhas, P-TeluguStop.com

మరి ప్రజెంట్ ఈ సంస్థ చేస్తున్న సినిమాలో పవన్ కళ్యాణ్ సినిమాతో పాటు డార్లింగ్ ప్రభాస్ సినిమా కూడా ఉంది.ఈ రెండు సినిమాలను వీరు తమ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

ఇక ఈ రెండు సినిమాల గురించి ఇప్పుడు ఒకేసారి అప్డేట్ ఇచ్చి మేకర్స్ ఇద్దరి ఫ్యాన్స్ కు బిగ్ ట్రీట్ ఇచ్చారు అనే చెప్పాలి.మరి ఈ సంస్థ చేస్తున్న సినిమాల్లో ప్రభాస్ – మారుతి కాంబో ఒకటి అయితే పవన్ కళ్యాణ్ – సాయి ధరమ్ తేజ్ కాంబో ఒకటి.

ఈ రెండు సినిమాలపై ఇరు ఫ్యాన్స్ ఫుల్ ఎగ్జైటింగ్ గా ఉన్నారు.మారుతి దర్శకత్వంలో ప్రభాస్ (Prabhas) ఒక సినిమాకు ( Raja Deluxe ) ఓకే చెప్పాడు.

ఇది కూడా 50 కోట్లతో తక్కువ బడ్జెట్ తో చేస్తున్న కూడా పాన్ ఇండియాలో రేంజ్ లో రిలీజ్ కానుంది.ఇక ఈ సినిమాలో ప్రభాస్ కు జోడిగా ముగ్గురు హీరోయిన్స్ నటించనున్నారు.ఇప్పటికే మాళవిక ఫిక్స్ అయ్యింది.ప్రజెంట్ శరవేగంగా షూటింగ్ జరుపు కుంటున్న ఈ సినిమాపై నిర్మాణ సంస్థ చాలా ధీమాగా ఉన్నట్టు తెలుస్తుంది.ఎందుకంటే ఈ సినిమా స్యూర్ షాట్ గా హిట్ అవుతుంది అని కాన్ఫిడెంట్ గా ఉన్నారు.

ఇక ఈ సినిమాతో పాటు వినోదయం సీతం (Vinodhaya Sitham) రీమేక్ కూడా ఈ సంస్థ నిర్మిస్తుంది.ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)- సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తుండగా సముద్రఖని డైరెక్ట్ చేస్తున్నాడు.ఇటీవలే షూట్ స్టార్ట్ అయిన ఈ సినిమాలో పవన్ తన పార్ట్ షూటింగ్ అప్పుడే పూర్తి చేసాడు.

ఇక ఈ సినిమా గురించి వీరు మాట్లాడుతూ.అతి త్వరలోనే అదిరిపోయే అప్డేట్ ఇస్తున్నట్టు కన్ఫర్మ్ చేయడంతో ఇద్దరు హీరోల ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube