వీడియో: థియేటర్‌లో ట్రైలర్ చూస్తుండగా.. ప్రేక్షకులపైకి దూకిన 'రియల్' దెయ్యం!!

సాధారణంగా మనం థియేటర్లో దెయ్యాల సినిమా చూస్తుంటే చాలా భయమేస్తుంది.దెయ్యాలు స్క్రీన్‌పైకి ఒక్కసారిగా వచ్చినప్పుడు గుండె ఆగినంత భయం కలుగుతుంది.

 Video While Watching The Trailer In The Theater A 'real' Ghost Jumped On The Aud-TeluguStop.com

అదే ఒక హారర్ మూవీ చూస్తూ, ఆ మూడ్‌లోనే ఉన్నప్పుడు నిజంగానే మన ముందుకు దెయ్యం వస్తే ఎంతగా భయపడతామో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.అయితే తాజాగా ఆ స్థాయిలో ఒక మహిళ హారర్ మూవీ చూసే వారిని భయపెట్టింది.

తనకు ఒక నిజమైన దెయ్యం ఆవహించిందన్నట్లు ఆమె ఘోస్ట్ అవతారంలో థియేటర్‌లో అడుగు పెట్టింది.

ఘోస్ట్ కాస్టూమ్( Ghost Costume ) ధరించి, దెయ్యం లాంటి కళ్లతో థియేటర్‌లోని ప్రేక్షకుల పైకి దూకింది.

తర్వాత థియేటర్ అంతటా తిరుగుతూ దెయ్యం లాగా ఆరిచేసి ప్రేక్షకుల గుండెల్లో గుబులు రేపింది.దీనికి సంబంధించిన వీడియోను ప్రేక్షకులలో ఒకరు రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఇది చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.వివరంగా తెలుసుకుంటే.

గ్లాడియేటర్ హీరో రస్సెల్ క్రో ( Russell Crowe )రీసెంట్‌గా నటించిన “ది పోప్స్ ఎక్సార్సిస్ట్”( The Pope’s Exorcist ) ఏప్రిల్ 7న భారతదేశంలో రిలీజ్ అయింది.ఇదే రోజున లేదా ఒక రోజు ముందు థియేటర్లలో ట్రైలర్ ప్లే చేశారు.

అయితే ఈ సినిమాపై అందరి దృష్టిని మళ్లించేందుకు మూవీ బృందం ఒక షాకింగ్ మార్కెటింగ్ వ్యూహం అనుసరించింది.అదే ట్రైలర్ ప్లే అవుతున్న టైమ్‌లో ఒక్కసారిగా ఒక మహిళను నిజమైన దెయ్యంగా ప్రేక్షకుల పైకి ఉసిగొల్పడం.దీనివల్ల ప్రేక్షకులు ఎంత భయపడతారో కూడా వారు ఆలోచించకుండా ఫాలో అయిపోయారు.ఫలితంగా ఆడియన్స్ భయంతో వణికిపోయారు.వైరల్ వీడియోలో హర్రర్ చిత్రం ట్రైలర్ థియేటర్‌లో ప్లే చేయబడినప్పుడు, ఒక దెయ్యం పట్టిన మహిళ తెల్లటి దుస్తులు ధరించి, పొడవాటి జుట్టుతో, ఘోరమైన కళ్ళతో గగుర్పాటు కలిగించడం చూడవచ్చు.ట్విట్టర్‌లో చాలా మంది ఈ స్టంట్ చేయడానికి ఆమెకు చాలా ధైర్యం అవసరమని కూడా అభిప్రాయపడ్డారు.

ఎందుకంటే ప్రేక్షకులలో ఎవరైనా ఆమెను కొట్టి ఉండవచ్చు.భయంతో ఆమెను విచక్షణారహితంగా పెట్టే అవకాశం ఉన్న ఆమె మాత్రం ఈ పని చేసి చాలామందిని ఆశ్చర్యపరిచింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube