సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పుష్ప 2 టీజర్... ఆ భాషలోనే అధిక వ్యూస్!

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ అల్లు అర్జున్(Allu Arjun) కాంబినేషన్లో వచ్చిన పుష్ప సినిమా(Pushpa Movie) ఈయనకు పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ తీసుకొచ్చింది.ఈ సినిమా మంచి హిట్ కావడంతో ఈ సినిమాకు సీక్వెల్ చిత్రం షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు.

 Allu Arjun Sukumar Pushpa 2 Teaser Is Shaking Social Media With Highest Views De-TeluguStop.com

అయితే నేడు అల్లు అర్జున్ పుట్టినరోజు(Birthday) కావడంతో శుక్రవారం సాయంత్రం ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేశారు.వేర్ ఈస్ పుష్ప హంట్ బిఫోర్ రూల్ అంటూ విడుదలైనటువంటి ఈ గ్లింప్ సోషల్ మీడియాను షేక్ చేస్తుందని చెప్పాలి.

ఈ టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

ముఖ్యంగా ఈ టీజర్ లో పుష్పను చూసి పులి వెనకడుగు వేసే సీన్ హైలెట్ అయిందని చెప్పాలి.ఇక ఈ టీజర్ లో బన్నీ లుక్ సైతం అందరిని ఎంతగానో ఆకట్టుకుంటుంది.ఇక ఈ టీజర్ విడుదలైన కొన్ని గంటలకే మిలియన్స్ వ్యూస్ రాబట్టుకొని యూట్యూబ్ ను షేక్ చేస్తుంది.

ఇక ఈ టీజర్ విడుదలైనప్పటి నుంచి ఇప్పటివరకు తెలుగులో 18 మిలియన్ వ్యూస్ రాబట్టగా హిందీలో మాత్రం భారీ స్థాయిలో వ్యూస్ రాబడుతుంది.హిందీలో ఈ టీజర్ ఏకంగా 20 మిలియన్ వ్యూస్ రాబట్టింది.

ఎన్నో అంచనాలు నడుమ ఈ సినిమా తెరకెక్కుతూ ఉండగా టీజర్ తోనే అల్లు అర్జున్ రికార్డుల మోత మోయిస్తున్నారు.

ఇక ఈ సినిమా నుంచి ఈయన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా అందరిని ఆకట్టుకుంటుంది.ఈ పోస్టర్ బట్టి చూస్తుంటే అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాలో సరికొత్త పాత్రలో సందడి చేయబోతున్నారని అర్థమవుతుంది.ఈ సినిమాలో అల్లు అర్జున్ కి జోడిగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.

ఇక ఇందులో సునీల్, అనసూయ, ఫహద్ ఫాజిల్ వంటి తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు.మరి ఈ సినిమా ఏ విధమైనటువంటి సంచలనాలను సృష్టిస్తుందో తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube