సాంకేతికత రంగంలో చాట్‌జీపీటీ( Chat GPT ) సృష్టిస్తున్న ప్రకంపనలు అన్నీఇన్నీ కావు.ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో పెను మార్పులు సంభవిస్తున్నాయి.
కార్పొరేట్ సంస్థలు అయితే ఏకంగా ఉద్యోగులను తొలగించి ఆర్థికపరమైన భారాన్ని తగ్గించుకునే యత్నంలో ఉంటే విద్యార్థులు సులువుగా తమ కావాల్సిన అంశాలను నేర్చుకుంటున్నారు.ఇక ఏఐ ఆధారిత చాట్‌జీపీటీ సేవలను అందించేందుకు గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు గట్టిగా పోటీ పడుతున్న విషయం అందరికీ తెలిసినదే.
మరోవైపు, ఏఐ, చాట్‌జీపీటీలతో భవిష్యత్‌లో మానవాళి మనుగడకే ప్రమాదం ఏర్పడొచ్చనే ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు కొందరు నిపుణులు.

ఈ క్రమంలో చాట్‌జీపీటీవంటి సాంకేతికతకు అడ్డుకట్టవేయాలని ఎలాన్ మస్క్( Elon Musk ) సహా పలువురు నిపుణులు ‘పాజ్ జియాంట్ ఏఐ ఎక్స్‌పెరిమెంట్స్’ పేరిట ఓ లేఖ రాయడం జరిగింది.గత కొద్ది నెలలుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న దిగ్గజ ఐటీ సంస్థలు ఆర్థిక మాంద్యం భయాలతో లేఆఫ్‌లు ప్రకటించాయి.అయితే వీరు తొలగించిన వారి స్థానాన్ని భవిష్యత్తులో ఏఐ, చాట్‌జీపీటీలు భర్తీ చేస్తాయనే ఆందోళనలు మొదలయ్యాయి.
ఈ నేపథ్యంలో చాట్‌జీపీటీ వినియోగంపై కొన్ని దేశాలు సమీక్షలు నిర్వహించాయి.పెద్దన్న అమెరికా ఏమంటుందంటే జో బైడెన్ ఓ సమీక్ష అనంతరం మాట్లాడుతూ.ఏఐ సాంకేతికత వినియోగం సమాజానికి ప్రమాదమని అభిప్రాయపడ్డారు.

అదేవిధంగా బ్రిటన్( Britain ) ఇప్పటికే పలు యూరప్ దేశాల్లో ఏఐ ఆధారిత చాట్‌జీపీటీ టూల్ వినియోగంపై పారదర్శకంగా వ్యవహరిస్తామని చెప్పుకొస్తోంది.ఇక యూరోపియన్ యూనియన్ విషయానికొస్తే డేటా భద్రత విషయంలో యూరోపియన్ యూనియన్‌లోని 27 దేశాలు కఠినమైన నిబంధనలను రూపొందించాయి.చాట్‌జీపీటీ వినియోగంపై ఇటలీ నిషేధం విధించడం అందుకు నిదర్శనం.
చైనా అయితే చాట్‌జీపీటీ వంటి ఏఐ ఆధారిత టూల్స్‌పై చైనా ఇప్పటికే నిషేధం విధించింది.అదే విధంగా రష్యా ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో దేశంలో ఇంటర్నెట్ వినియోగంపై రష్యా ఆంక్షలు విధించింది.
దీంతో చాట్‌జీపీటీ వంటి ఏఐ టూల్స్ అక్కడి ప్రజలకు అందుబాటులో ఉండే అవకాశంలేదు.







