సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పుష్ప 2 టీజర్… ఆ భాషలోనే అధిక వ్యూస్!
TeluguStop.com
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ అల్లు అర్జున్(Allu Arjun) కాంబినేషన్లో వచ్చిన పుష్ప సినిమా(Pushpa Movie) ఈయనకు పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ తీసుకొచ్చింది.
ఈ సినిమా మంచి హిట్ కావడంతో ఈ సినిమాకు సీక్వెల్ చిత్రం షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు.
అయితే నేడు అల్లు అర్జున్ పుట్టినరోజు(Birthday) కావడంతో శుక్రవారం సాయంత్రం ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేశారు.
వేర్ ఈస్ పుష్ప హంట్ బిఫోర్ రూల్ అంటూ విడుదలైనటువంటి ఈ గ్లింప్ సోషల్ మీడియాను షేక్ చేస్తుందని చెప్పాలి.
ఈ టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. """/" /
ముఖ్యంగా ఈ టీజర్ లో పుష్పను చూసి పులి వెనకడుగు వేసే సీన్ హైలెట్ అయిందని చెప్పాలి.
ఇక ఈ టీజర్ లో బన్నీ లుక్ సైతం అందరిని ఎంతగానో ఆకట్టుకుంటుంది.
ఇక ఈ టీజర్ విడుదలైన కొన్ని గంటలకే మిలియన్స్ వ్యూస్ రాబట్టుకొని యూట్యూబ్ ను షేక్ చేస్తుంది.
ఇక ఈ టీజర్ విడుదలైనప్పటి నుంచి ఇప్పటివరకు తెలుగులో 18 మిలియన్ వ్యూస్ రాబట్టగా హిందీలో మాత్రం భారీ స్థాయిలో వ్యూస్ రాబడుతుంది.
హిందీలో ఈ టీజర్ ఏకంగా 20 మిలియన్ వ్యూస్ రాబట్టింది.ఎన్నో అంచనాలు నడుమ ఈ సినిమా తెరకెక్కుతూ ఉండగా టీజర్ తోనే అల్లు అర్జున్ రికార్డుల మోత మోయిస్తున్నారు.
"""/" /
ఇక ఈ సినిమా నుంచి ఈయన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా అందరిని ఆకట్టుకుంటుంది.
ఈ పోస్టర్ బట్టి చూస్తుంటే అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాలో సరికొత్త పాత్రలో సందడి చేయబోతున్నారని అర్థమవుతుంది.
ఈ సినిమాలో అల్లు అర్జున్ కి జోడిగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.
ఇక ఇందులో సునీల్, అనసూయ, ఫహద్ ఫాజిల్ వంటి తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు.
మరి ఈ సినిమా ఏ విధమైనటువంటి సంచలనాలను సృష్టిస్తుందో తెలియాల్సి ఉంది.