సినిమా ఇండస్ట్రీ లో ఉన్న హీరో హీరోయిన్స్ మీద ఎప్పుడు సోషల్ మీడియా లో చర్చ జరుగుతూనే ఉంటుంది.అయితే ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కడ చూసినా సమంత( Samantha ) న్యూస్ కనిపిస్తుంది…ఆమె నటించిన శాకుంతలం సినిమా విడుదల దగ్గర పడటంతో .
ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు .దీనితో సమంత హాట్ టాపిక్ అవుతుంది .ఇక మొదట్లో గ్లామర్ పాత్రలు చేసి అదరగొట్టిన సమంత .ఇటీవల కాలంలో మాత్రం ఎక్కువగా హీరోయిన్ ఒరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తోంది.ఇక ది ఫ్యామిలీ మ్యాన్ వంటి వెబ్ సిరీసులో బోల్డ్ సన్నివేశాల్లో కూడా నటిగా అదరగొట్టింది.ఇప్పుడు అంతకుమించిన రేంజ్ లో హాట్ పర్ఫామెన్స్ ఇవ్వడానికి సమంత ఓకే చెప్పిందని వార్తలు వస్తున్నాయి.
ది ఫ్యామిలీ మ్యాన్ 2( The Family Man 2 ) వెబ్ సిరీస్, పుష్పలోని ఊ అంటావా మావా ఐటమ్ సాంగ్ తో దేశవ్యాప్తంగా పాపులర్ అయిన సమంత త్వరలో శాకుంతలం( Sakunthalam ) అనే మూవీతో ప్రేక్షకులను పలకరించనుంది.అందమైన ప్రేమ కావ్యంగా తెరకెక్కిన ఈ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్, ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది.
అన్నిటికి మించి ఇందులో సమంత దేవకన్యను మైమరిపించేలా ఉందని ప్రశంసలు దక్కాయి.

ఈ సినిమా ద్వారా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) గారాల పట్టి అల్లు అర్హ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనుండటం విశేషం.సమంత శాకుంతలం సినిమా కాకుండా మరో బ్యూటిఫుల్ లవ్ స్టోరీగా వస్తున్న ఖుషీ( Khushi ) అనే సినిమా చేస్తోంది.ఇందులో విజయ్ దేవరకొండతో కలిసి ప్రేమాయణం సాగించనుంది మజిలి దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతున్నట్లు సమాచారం.
అలాగే సమంత సిటాడెల్ అనే హాలీవుడ్ వెబ్ సిరీసులోనూ నటిస్తోన్నది.గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా( Global star Priyanka Chopra ), హాలీవుడ్ యాక్టర్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫేమ్ రిచర్డ్ మ్యాడెన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సిరీస్ ఇంగ్లీష్ వెర్షన్ ట్రైలర్ ను ఇటీవల విడుదల చేశారు.
ఇందులో హై ఓల్టేజ్ యాక్షన్స్ సీక్వెన్స్ తో పాటు ఘాటు బెడ్ రూమ్ సన్నివేశాల్లో అదరగొట్టింది ప్రియాంక చోప్రా.రిచర్డ్ మ్యాడెన్ తో కలిసి చేసిన రొమాంటిక్ సీన్స్ అలరించేలా ఉన్నాయి.
అయితే ఈ హాలీవుడ్ సిటాడెల్ కు ఇండియన్ వెర్షన్ గా వస్తున్న వెబ్ సిరీసులో సమంత నటిస్తున్న ప్రకటన రావడంతో హాట్ సన్నివేశాలపై చర్చ జరుగుతోంది.ప్రియాంక చోప్రా తరహాలో బోల్డ్ గా సమంత నటించనుందా అనే అనుమానాలు తలెత్తాయి.
అయితే తాజాగా అలాంటి సెమీ న్యూడ్ సన్నివేశాల్లో నటించేందుకు సమంత అంగీకారం తెలిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి…మరి ఈ రోల్ లో సమంత ఏ మేరకు అలరిస్తుంది అనేది చూడాలి…
.







