ఇటీవల జరిగిన ఎన్నికలలో ఓటమి ఎదురు కావడంతో ప్రజల్లోకి మరింత బలంగా వెళ్లాలని వైసీపీ పార్టీ అధిష్టానం నిర్ణయించుకుంది దానిలో భాగంగానే జగనన్నే మా భవిష్యత్తు( Jagananne Maa Bhavishyathu Program ) కార్యక్రమంతో ఆంధ్ర లోని ప్రతి గడపకు వెళ్లాలని లక్ష్యం నిర్దేశించుకుంది… దాదాపు 5 కోట్ల మందిని ప్రత్యక్షంగా కలుసుకునే లక్ష్యంతో మొదలైన ఈ కార్యక్రమంలో దాదాపు 7 లక్షల మంది గృహ సారథులు, సచివాలయ కన్వీనర్లు,, ప్రజాప్రతినిధులు పాల్గొంటారు… ప్రతి ఇంటి గడపకి వెళ్లి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించి చెప్పి వారు ఎదుర్కొంటున్న సమస్యలను అప్పటికప్పుడు తీర్చేలా డిజైన్ చేయబడిన ఈ కార్యక్రమం మీద వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ( YSRCP ) భారీ నమ్మకం పెట్టుకుందని తెలుస్తుంది…… ఎన్నికలకు ఎక్కువగా సమయం లేనందున ప్రజల్లో ఏమైనా వ్యతిరేకత ఉంటే దాన్ని తెలుసుకొని సరిచేసుకునేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారని ప్రతి ఇంటికి వెళ్లాలని నెలలో 20 రోజులు పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలనిప్రజలకు జగన్ దిశా నిర్దేశం చేస్తారని తెలుస్తుంది.
గ్రాఫ్ తగ్గిన ఎమ్మెల్యేలు మరింత యాక్టివ్ గా పని చేయాలని ప్రజలకు కావలసిన ఏ పనినైనా చేసి పెట్టేలా అధికారులు సిద్ధంగా ఉంచుతానని ఆ దిశగా అప్పటి ఇప్పటికే కలెక్టర్ కార్యాలయాలకు కూడా ఆదేశాలు జారీ చేశానని ఎమ్మెల్యేలుఅది గుర్తించి ఆ దిశగా ముందుకు వెళ్లాలని లేకుంటే మాత్రం ఇబ్బందులు తప్పవని స్పష్టం చేశారట .
తమ సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని.ఎన్ని విమర్శలు చేసినా ప్రతిపక్షాలను ప్రజలు పట్టించుకోర….ఎంతమంది పొత్తులు పెట్టుకున్నా కూడా తమ పొత్తు ప్రజలతో అంటూ చెప్పుకుంటూ వస్తున్న జగన్( YS jagan ) ఈ కార్యక్రమం ద్వారా పూర్తిస్థాయి ప్రజాభిమానాన్ని దక్కించుకోవాలని తద్వారా మరొకసారి అధికారులకు రావాలని లెక్కలు వేసుకున్నట్లుగా తెలుస్తుంది మరి ఆయన అంచనాలు ఏ మేరకు నిజమవుతాయో వచ్చే ఎన్నికలలో తెలుస్తుంది