క్యాబేజీ( Cabbage ) దేశవ్యాప్తంగా పండించబడుతున్న ఆకు కూరగాయ గా చెప్పుకోవచ్చు.క్యాబేజీ సాగు చేయాలంటే ఉష్ణోగ్రత 10 నుంచి 15 డిగ్రీల మధ్యన ఉండాలి.నేల యొక్క పీహెచ్ విలువ 6 నుంచి 6.5 వరకు ఉంటే అనుకూలంగా ఉంటుంది.ఇక ఇసుక, బంక మట్టి ( Sand, clayey soil )నేలలలో క్యాబేజీ బాగా పెరుగుతుంది.ఏడాది పొడవునా సాగు చేయవచ్చు.నేలను ఆఖరిగా దుక్కి దున్నే సమయంలో బాగా కుళ్ళిన పశువుల ఎరువు వేసి కలియదున్నాలి.ఇక చదునైన నేల మీద కాకుండా ఎత్తు మడులు ఏర్పాటు చేసి సాగు చేయాలి.100 కేజీల వేప పిండి, ట్రైకోడెర్మా హార్జియనం రెండు కిలోలు, పాసిలోమైసిస్ లిలసినస్ రెండు కిలోలను మిశ్రమం చేసుకొని మడులపై చల్లాలి.

ఇక విత్తనాల విషయానికొస్తే ప్రో-ట్రే( Pro-tray ) లలో పెంచిన మొలకలు కాకుండా, సాధారణ నేలలో పెంచిన మొలకలను పంట పొలంలో నాటుకోవాలి.నెలరోజుల వయసు ఉండి, నాలుగు లేదా ఐదు ఆకులు ఉండే మొలకలు ఆరోగ్యంగా ఉంటాయి.ఎకరాకు 120 గ్రాముల విత్తనాలు అవసరం.
ఇక మొలకలు నాటడానికి ఒక రోజు ముందు మడులపై పెండిమెథాలిన్( Pendimethalin ) 30%EC నాలుగు మిల్లీలీటర్లు, ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారి చేస్తే దాదాపు కొన్ని రోజులపాటు కలుపు సమస్యలు ఉండవు.విత్తాడనికి ముందు మొలకల వేర్లను కార్బెమ్ డిజమ్ 50%WP 3 గ్రా, స్ట్రేప్టోసైక్లిన్ 0.10 గ్రా .ఒక లీటర్ నీటిలో కలిపి 30 నిమిషాలు నానబెడితే వేరు కుళ్ళు సోకకుండా ఉంటుంది.మొక్క మొక్కకు మధ్య 50 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు నాటుకొని తేలికపాటి నీటిని అందించాలి.నీటిని పారించకుండా బిందు సేద్యపు గొట్టాలను మడుల మూలలో ఏర్పాటు చేసి నీటిని అందించడం వల్ల మంచి నాణ్యత గల క్యాబేజీ పంట దిగుబడి పొందవచ్చు.







