దక్షిణాఫ్రికా : డబ్బు కోసం కిడ్నాప్ నాటకం.. అడ్డంగా దొరికిపోయిన భారత సంతతి మహిళ

భర్త నుంచి డబ్బు గుంజేందుకు గాను దక్షిణాఫ్రికా( South Africa )లో ఓ భారత సంతతి మహిళ స్కెచ్ గీసి పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది.తాను కిడ్నాప్ అయ్యానని.

 47-year-old Indian-origin Woman In South Africa Charged With Perjury For Faking-TeluguStop.com

విడుదల చేయాలంటే 2 మిలియన్ ర్యాండ్లు ఇవ్వాలని డిమాండ్ చేసింది.డర్బన్‌కు ఉత్తరాన వున్న ఫీనిక్స్‌కు చెందిన 47 ఏళ్ల ఫిరోజా బీ జోసెఫ్ పీటర్‌మారిట్జ్‌బర్గ్‌( Pietermaritzburg )లోని ఓ హోటల్ గదిలో పోలీసులకు కనిపించింది.

ఈ కేసుకు సంబంధించి జూన్ 7న తదుపరి కోర్ట్ విచారణ వరకు ఆమెకు బెయిల్ మంజూరు చేసినట్లు నేషనల్ ప్రాసిక్యూటింగ్ అథారిటీ ప్రతినిధి నటాషా కారా తెలిపారు.కిడ్నాప్‌కు సంబంధించి ఫిరోజా చెప్పినదంతా అబద్ధమని పోలీసులు తేల్చారు.

Telugu Cape Town, Indian Origin, Kidnap, Saps, Africa-Telugu NRI

ఫిరోజా కిడ్నాప్‌కు గురైనట్లు ఆమె భర్తకు సోమవారం కాల్ వచ్చిందని.తనను విడుదల చేయాలంటే డబ్బును ఇవ్వాలని చెప్పినట్లు పోలీస్ ప్రతినిధి కల్నల్ రాబర్ట్ నెట్‌షిండా తెలిపారు.ఛార్జ్‌షీట్ ప్రకారం ఆ మొత్తం 2 మిలియన్ ర్యాండ్‌లుగా తెలుస్తోంది.దీనిపై రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేస్తుండగా.ఫీనిక్స్‌కు 80 కిలోమీటర్ల దూరంలో వున్న పీటర్‌మారిట్జ్‌బర్గ్‌లోని ఒక కాసినోలో ఫిరోజా వున్న ఫుటేజీని కనుగొన్నారు.అంతేకాకుండా కిడ్నాపర్లు తన ఆభరణాలన్నీ ఎత్తుకెళ్లారని ఆమె చెప్పిన మాట కూడా అబద్ధమని పోలీసులు తేల్చారు.

Telugu Cape Town, Indian Origin, Kidnap, Saps, Africa-Telugu NRI

ఇదిలావుండగా.గతేడాది నవంబర్‌లో దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌( Cape Town )లో కిడ్నాప్‌కు గురైన భారత సంతతి బాలిక( Indian-origin girl ) కథ సుఖాంతమైన సంగతి తెలిసిందే.రిలాండ్స్ ప్రైమరీ స్కూల్‌లో చదువుతున్న 8 ఏళ్ల బాలిక అబిరా దేఖ్తా నవంబర్ 4వ తేదీ ఉదయం తన స్కూల్ ట్రాన్స్‌పోర్ట్ వాహనంలో కూర్చొని వుండగా.కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను అపహరించుకుపోయారు.

ఆమె తల్లిదండ్రులు కొన్నేళ్ల క్రితం భారత్ నుంచి వలస వచ్చి కేప్‌టౌన్‌లో స్థిరపడ్డారు.ఆమె తండ్రి నగరంలో మొబైల్ ఫోన్ వ్యాపారం నిర్వహిస్తున్నారు.

దక్షిణాఫ్రికా పోలీస్ సర్వీసెస్ (ఎస్ఏపీఎస్).దేఖ్తా సురక్షితంగా ఆమె కుటుంబం వద్దకు చేరినట్లు ధ్రువీకరించింది.

ప్రత్యేక పోలీస్ విభాగాలకు చెందిన ఎస్ఏపీఎస్ సభ్యులు.సిటీ ఆఫ్ కేప్‌టౌన్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి బాలికను టౌన్ టూ, ఖయెలిట్షాలోని ఒక గుడిసెలో గుర్తించారు.

ఖయెలిట్షా అనేది కేప్‌టౌన్ శివార్లలో వున్న నల్లజాతి టౌన్‌షిప్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube