సోషల్ మీడియాలో గత నాలుగు ఐదు రోజులుగా కిచ్చా సుదీప్( Kichha Sudeep ) పేరు మారుమోగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే.ఒకటి సుదీప్ బిజెపిలో ( BJP ) చేరబోతున్నాడు అన్న వార్త కాగా మరొకటి సుదీప్ కు వచ్చిన బెదిరింపు లేఖలు.
రెండు విషయాలలో ఇతని పేరు మార్మోగిపోతుంది.సుదీప్ కి బెదిరింపు లేఖలు రావడంతో సంచలనంగా మారిన విషయం తెలిసిందే.
ఆ లేఖల కారణంగా సుదీప్ బిజెపిలో చేరకుండా వెనకడుగు వేశారు.కేవలం బీజేపీ కి మద్దతు మాత్రమే ఇచ్చి తప్పుకున్నాడు అంటూ జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి.

కాగా ఇదే విషయం పై కర్నాటక ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.సుదీప్ కి వచ్చిన లేఖను చాలా సీరియస్ గా తీసుకున్నారు ముఖ్యమంత్రి.వెంటనే విచారణకు ఆదేశించారు.రంగంలోకి దిగిన పోలీసులు, సుదీప్ కారు డ్రైవర్ ను అనుమానిస్తున్నారు.అయితే సుదీప్ కొన్నాళ్ల కిందట తన కారు డ్రైవర్ ను పనిలో నుంచి తీసేసాడు.దాంతో అతనే సుదీప్ పై కక్షకట్టి ఈ బెదిరింపు లేఖకు పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
దానికి తోడు డ్రైవర్ పరారీలో ఉండడంతో పాటు అతను ఫోన్ స్విచాఫ్ రావడంతో వార్తలు నిజమే అని చాలా మందిని విశ్వసిస్తున్నారు.

సుదీప్ కారు డ్రైవర్ ను పట్టుకుంటే, లేఖకు సంబంధించి పూర్తి వివరాలు బయటకొస్తాయని పోలీసులు భావిస్తున్నారు.కేవలం వ్యక్తిగత కక్షతోనే అతడు ఈ పనికి పాల్పడ్డాడా లేక ప్రతి పక్షాలు అతడితో ఈ పని చేయించాయా అన్న కోణంలో కూడా దర్యాప్తును చేయబోతున్నట్టు తెలుస్తోంది.అయితే ముందు వీటన్నింటికీ కంటె అసలు సుదీప్ ప్రైవేట్ వీడియో నిజంగానే అతడి దగ్గర ఉందా? లేదా?అనే విషయాన్ని పోలీసులు నిర్థారించుకోవాల్సి ఉంది.తనకు సంబంధించిన ప్రైవేట్ వీడియో అతడి దగ్గర ఉండొచ్చని ఈ సందర్భంగా సుదీప్ అనుమానం వ్యక్తం చేయడం విశేషం.మొత్తానికి పరారీలో ఉన్న ఆ డ్రైవర్ దొరికితే ఈ విషయం ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.







