రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన 'జగనన్నే మా భవిష్యత్తు' మెగా పీపుల్ సర్వే

తాడేపల్లి: రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన ‘జగనన్నే మా భవిష్యత్తు’ మెగా పీపుల్ సర్వే.7 లక్షల మంది పార్టీ సైనికులతో 14 రోజుల్లో 1.65 కోట్ల గడపలకు వైఎస్సార్ సీపీ.వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చేసిన మంచిని ప్రచారం చేస్తూ సర్వే.82960 82960 నంబర్ కి మిస్డ్ కాల్ ద్వారా జగనన్న సందేశం అందుకోవచ్చు- మంత్రి బొత్స.ఏ రాజకీయ పార్టీ చేయని ప్రతిష్టాత్మక కార్యక్రమం – ఆళ్ల అయోధ్య రామిరెడ్డి .జగనన్నే మా నమ్మకం అనే నినాదం ప్రజల నుంచి వచ్చినదే- ఎంపీ సంజీవ్ కుమార్.ఇంటి తలుపు, సెల్ ఫోన్ కు “మా నమ్మకం నువ్వే జగనన్న” స్టిక్కర్లు -ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్.

 Jagananne Maa Bhavishyathu Mega People Survey Started In Tadepalli Details, Jaga-TeluguStop.com

రాష్ట్రవ్యాప్తంగా ‘జగనన్నే మా భవిష్యత్తు’ అనే మెగా పీపుల్ సర్వే కార్యక్రమం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం నాడు ఘనంగా ప్రారంభమైంది.2 వారాల పాటు జరిగే ఈ మెగా పీపుల్ సర్వే ద్వారా వైయస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన మంచిని పచ్రారం చేస్తూ రాష్ట్రంలో ఉన్న ప్రతీ ఇంటికి వెళ్లి సర్వే నిర్వహిస్తారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.

మంత్రి బొత్స తో పాటు ఈ కార్యక్రమంలో ఎంపీ సంజీవ్ కుమార్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ పాల్గొని మెగా పీపుల్ సర్వే కార్యక్రమం గురించి మీడియాకు వివరాలు వెల్లడించారు.నిష్పక్షపాతంగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల సంక్షేమ, ఆర్థిక పురోగతి కోసం అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత జగన్ కు మాత్రమే దక్కుతుందన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా నేటి ఉదయం నుంచే ఈ కార్యక్రమం మొదలైందని తెలిపారు.నేటి నుంచి రెండు వారాల పాటు మా నాయకులు ప్రతి ఇంటికి వెళ్లి జరిగిన సంక్షేమం, అభివృద్ధి గురించి వివరాలు చెప్పి వాళ్ళ అభిప్రాయం తీసుకుంటారు.

Telugu Cm Jagan, Jaganannemaa, Botsa, Mlcmarri, Tadepalli-Press Releases

1.65 కోట్ల ఇళ్లకి వెళ్లి ఈ సర్వే చేపడతాం.7 లక్షలు మంది పార్టీ సైనికలు, సచివాలయ కన్వీనర్ లు ఈ సర్వే కోసం అందుబాటులో ఉంటారు.జగనన్న ప్రభుత్వానికి టీడీపీ ప్రభుత్వానికి గల తేడాలను పోల్చి చెబుతారు.

ప్రజా మద్దతు పుస్తకంలో ప్రజల స్పందనను నమోదు చేసుకుంటారు.ఇంటి యజమానికి అంగీకారంతో ఇంటి తలుపుకి మా నమ్మకం నువ్వే జగనన్న స్టికర్ అతికిస్తాం.

సెల్ ఫోన్ కి కూడా స్టికర్ అతికిస్తాం.ప్రజల మొబైల్ నెంబర్ నుంచి 82960 82960 నంబర్ కి మిస్డ్ కాల్ ద్వారా జగనన్న కీలక సందేశం ప్రజలకు అందిస్తారు.

రాష్ట్రంలో మళ్ళీ వైస్సార్ పాలన.ఆళ్ల అయోధ్య రామిరెడ్డి.

దేశంలో ఇలాంటి కార్యక్రమం జరగడం ఇదే మెదటిసారి.భవిష్యత్తులో కూడా మళ్ళీ సీఎంగా జగన్ ఉండాలి.

కుల, మత, పార్టీలకు అతీతంగా ఈ మెగా పీపుల్ సర్వే జరుగుతుంది.సిఎం జగన్ స్థానం ప్రజల గుండెల్లో.ఎంపీ సంజీవ్ కుమార్ .ప్రస్తుతం సమాజంలో పేదలకు, ధనికులకి మధ్య యుద్ధం జరుగుతోంది.సిఎం జగన్ పేదల తరుపున యుద్ధం చేస్తున్నారు.సిఎం జగన్ ఒక కారుణ జన్ముడు అయన ఒక దేవుడు.సామజిక కుట్రలు జరుగుతున్నాయి వాటిని ప్రజలు తిప్పికొట్టాలి.సంక్షేమం, అభివృద్ధి చేసామనే ధీమాతో ప్రజల ముందుకు.

ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్.ఇప్పటికే గడప గడపకి తిరిగి ప్రజలకి జరిగిన అభివృద్ధి వివరించి చెబుతున్నాము.

ఇప్పుడు జగనన్నే మా భవిష్యత్తు పేరుతో మెగా పీపుల్స్ సర్వే కోసం ధైర్యంగా ప్రజల ముందుకు వెళుతున్నాం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube