జగన్ బటన్ నొక్కుడు.. ఎన్నికల్లో పని చేస్తుందా ?

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టి నాలుగేళ్ళు పూర్తయింది.మరి ఈ నాలుగేళ్లలో ఈ‌పి‌ఐ లో జగన్ చేసిన ఆభివృద్ది ఏంటీ ? రాష్ట్రంలో వచ్చిన మార్పు ఏమిటి ? జగన్ పాలనకు చంద్రబాబు( Chandrababu Naidu ) పాలనకు ఏమైనా వ్యత్యాసం కనిపించిందా ? ఇలాంటి ప్రశ్నలు చర్చకు రావడం సర్వసాధారణం.అయితే అధికారంలోకి వచ్చిన మూడేళ్లలోనే 90 ఇచ్చిన హామీలను నెరవేర్చామని, ఇలా ఏ సి‌ఎం చేయలేదని వైసీపీ నేతలు జబ్బలు చారుస్తున్నారు.అయితే జగన్ పాలనలో కేవలం బటన్ నొక్కుడు తప్పా.

 Will Jagan's Plan Work?, Ys Jagan , Ysrcp, Chandrababu Naidu , Ap Politics , Wel-TeluguStop.com

జరిగిన ఆభివృద్ది ఏంటో చెప్పాలని ప్రతిపక్షాలు చేసే విమర్శలకు జగన్ సర్కార్ వద్ద సమాధానం లేని పరిస్థితి.

Telugu Ap, Chandrababu, Gruha Sarathi, Welfare Schemes, Ys Jagan, Ysrcp-Politics

కేవలం సంక్షేమ పథకాలు ( Welfare schemes )అమలు చేస్తే రాష్ట్రంలో ఆభివృద్ది జరిగినట్లేనా.సామాన్యుడికి అవసరమయ్యే మౌలిక వసతులు అనగా రోడ్లు వేయడం, ధరలు తగ్గించడం, పెట్టుబడులు ఆకర్షించడం, పరిశ్రమలు నెలకొల్పడం వంటివి చేయాల్సిన అవసరం లేదా ? అని జగన్ సర్కార్ ను నిలదీస్తున్నాయి ప్రతిపక్షాలు.ఇక టిడిపి నేతలు అయితే తమ హయంలో జరిగిన ఆభివృద్ది ఇది అని ఫోటోలతో సహ ఆధారాలు చూపిస్తున్నారు.

మరి వైసీపీ నేతలు అలా చూపించగలరా ? అనే చెప్పలేని పరిస్థితి.కానీ ఏం చేయకపోయిన అన్నీ తామే చేసినట్లు పబ్లిసిటీ చేసుకోవడంలో మాత్రం జగన్ సర్కార్ ముందు వరుసలో ఉన్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.

Telugu Ap, Chandrababu, Gruha Sarathi, Welfare Schemes, Ys Jagan, Ysrcp-Politics

తాజాగా గృహ సారథులను( Gruha sarathi ) నియమించిన జగన్ సర్కార్ వారి ద్వారా తాము అమలు చేసిన పథకాలు ఏంటో ప్రజలకు తెలిపే ప్రయత్నం చేస్తోంది.ఇదంతా కుడా ఒక పబ్లిసిటీ స్టాంటే అనే విమర్శ కూడా ఉంది.అయితే గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా ఇదే ఫార్ములా ఫాలో అయిన జగన్ కు ప్రజల నుంచి ఊహించని విధంగా షాక్ తగిలింది.ఎందుకంటే ప్రజల్లోకి వెళ్ళిన నేతలపై ప్రజలే తిరగబడే పరిస్థితి ఉంది.

ఇప్పుడు గృహ సారథులను కూడా ఇదే కన్సెప్ట్ తో ప్రజల్లోకి పంపిస్తున్నారు జగన్.మరి గుర్హ సారథులపై కూడా ప్రజలు తిరగబడే అవకాశం లేకపోలేదు.

మొత్తానికి తను బటన్ నొక్కుడుతో అమలు చేస్తున్న పథకాలే గట్టెకిస్తాయని నమ్ముతున్నా సి‌ఎం జగన్.ఈ పబ్లిసిటీ స్టంట్ ఎన్నికల్లో ఏమేరకు పని చేస్తుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube