సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha Ruth Prabhu) ప్రధాన పాత్రలో టాలెంటెడ్ డైరెక్టర్ గుణశేఖర్ (Gunasekhar) దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ సినిమా ”శాకుంతలం”(Shaakuntalam).లేడీ ఓరియెంటెడ్ అయినా కూడా ఈ సినిమా భారీ బడ్జెట్ తో భారీ నిర్మాణ విలువలతో తెరకెక్కింది.ఈ సినిమా పౌరాణిక నేపథ్యంలో తెరకెక్కింది.ఈ సినిమా ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న కూడా ఇప్పటి వరకు రిలీజ్ కాలేదు.
ఏదొక అడ్డంకి ఎదురవుతూ వాయిదా పడుతూ వస్తుంది.అందుకే ఈసారి ఈ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి మేకర్స్ సిద్ధం అవుతున్నారు.
ఈ సినిమాలో మేల్ లీడ్ లో దేవ్ మోహన్ నటించాడు.అలాగే ఇందులో అల్లు అర్జున్ డాటర్ అల్లు అర్హ కూడా బాలనటిగా పరిచయం కాబోతుంది.
పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాను గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై నీలిమ గుణ మరియు దిల్ రాజు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఏప్రిల్ 14న ఈ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.ఈ క్రమంలోనే సమంత కూడా ఈ సినిమా ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొంటుంది.తాజాగా జరిగిన ప్రమోషన్స్ లో సామ్ తాను చేస్తున్న నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేసింది.
సామ్ తాను నటిస్తున్న బాలీవుడ్ ప్రాజెక్ట్ సీటాడెల్ (Citadel) గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి.
రాజ్ అండ్ డీకే లు డైరెక్టర్ చేస్తున్న ఈ సిరీస్ లో వరుణ్ ధావన్ (Varun Dhawan), సమంత కీలక పాత్రల్లో నటిస్తున్నారు.తాను చేస్తున్న పాత్రల నుండి మంచి గుర్తింపు రావడం ఆనందంగా ఉందని.కెరీర్ లో ఇంత దూరం వస్తానని అనుకోలేదని తెలిపింది.
అలాగే సిటాడెల్ సిరీస్ షూట్ లో ప్రతీ రోజు ఉత్సాహంగా ఉంటుందని.ఒక స్ర్తీకి యాక్షన్ చేయడం కష్టం అయినా ఇందులో అలాంటి యాక్షన్ చేయడం సంతృప్తికరంగా ఉందని కొత్త అనుభవాలను ఆస్వాదిస్తున్నానని సామ్ తెలిపింది.