చిన్న కొడుకుకు పేరు పెట్టిన లాస్య... ఏం పేరు పెట్టారో తెలుసా?

బుల్లితెరపై యాంకర్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో యాంకర్ లాస్య(Anchor Lasya) ఒకరు.కెరియర్ మొదట్లో మ్యూజిక్ ఛానల్ కు యాంకర్ గా వ్యవహరిస్తున్నటువంటి ఈమె అనంతరం బుల్లితెరపై వరుస కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

 Anchor Lasya Second Baby Name Moksh Adheeran Details, Anchor Lasya,youtube Chann-TeluguStop.com

ఇక ఈమె మంజునాథ్(Manjunath) అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత బుల్లితెర కార్యక్రమాలకు కాస్త దూరమయ్యారు.పెళ్లి తర్వాత బిగ్ బాస్ (Bigg Boss)కార్యక్రమంలో పాల్గొన్నటువంటి లాస్య తిరిగి మరింత క్రేజ్ సొంతం చేసుకున్నారు.

ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈమె యూట్యూబ్ ఛానల్(Youtube Channel) ప్రారంభించి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అయ్యారు.

ఇకపోతే లాస్య మంజునాథ్ దంపతులకు ఇదివరకే ఓ బాబు ఉన్న విషయం మనకు తెలిసిందే.అయితే తాజాగా ఈమె మరొక బిడ్డకు కూడా జన్మనిచ్చారు.తిరిగి తనకు బాబు పుట్టారు అంటూ లాస్య హోలీ పండుగ సందర్భంగా తన సెకండ్ బేబీ గురించి రివీల్ చేశారు.

ఇలా ఇద్దరు పిల్లలకు తల్లి అయినటువంటి లాస్య నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు.అయితే తాజాగా తన చిన్న కుమారుడు నామకరణ మహోత్సవాన్ని(Naming Cermony) ఎంతో ఘనంగా చేసినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన వీడియోని ఈమె ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేయడంతో ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది.ఇందులో లాస్య దంపతులు తన పిల్లలతో కలిసి మల్లెపూల పందిరి కింద వెళ్తూ ఉన్నట్టు కనిపించారు.ఈ వీడియోలో వీరందరూ కూడా ఒకే రకమైన దుస్తులను ధరించి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.ఇకపోతే తన చిన్న కుమారుడికి మోక్ష్ అధీరన్(Moksh Adheeran) అని నామకరణం చేసినట్లు ఈ సందర్భంగా లాస్య ఈ వీడియోని షేర్ చేస్తూ తన కుమారుడి పేరును రివిల్ చేశారు.

ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారడంతో పలువురు నేటిజన్స్ శుభాకాంక్షలు తెలియజేశారు.

https://www.facebook.com/reel/1422401165230173
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube