ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుపై ముమ్మర దర్యాప్తు చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనుబంధ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది.ఈ మేరకు నిందితులుగా ఉన్న రాజేశ్ జోషి, మాగుంట రాఘవ, మల్హోత్రాలకు సంబంధించిన కంపెనీలపై అభియోగాలు మోపింది ఈడీ.
రెండో అనుబంధ ఛార్జ్ షీట్ ను పరిగణనలోకి తీసుకోవడంపై ఈనెల 14న సీబీఐ ప్రత్యేక కోర్టు విచారణ జరపనుంది.ఇప్పటికే దాఖలు చేసిన మొదటి అనుబంధ ఛార్జ్ షీట్ లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై తీవ్ర అభియోగాలు చేసింది.
మొదటి అనుబంధ ఛార్జ్ షీట్ తరువాత మాగుంట రాఘవ, సిసోడియాతో పాటు అరుణ్ రామచంద్రన్ పిళ్లైను అరెస్ట్ చేసింది.అదేవిధంగా కవితను మూడు సార్లు ప్రశ్నించింది ఈడీ.కాగా మద్యం కుంభకోణంలో ఇది మూడవ ఛార్జ్‌షీట్ అని తెలుస్తోంది.ఈ నేపథ్యంలో గడువులోగా ఛార్జ్‌షీట్ అందించామని ఈడీ కోర్టుకు తెలిపింది.







