అమెరికా : కుల వివక్షపై చట్టం వద్దు.. కాలిఫోర్నియాలో ఇండియన్ కమ్యూనిటీ ఆందోళన

అమెరికాలోని కాలిఫోర్నియాలో( California ) భారత సంతతి కమ్యూనిటీ ఆందోళనకు దిగింది.కుల వివక్షను నిషేధించాలని కోరుతూ ఆ రాష్ట్ర సెనేట్‌లో బిల్లును ప్రవేశపెట్టినందుకు గాను డెమొక్రాటిక్ సెనేటర్‌పై ఇండో అమెరికన్లు( Indian-Americans ) భగ్గుమంటున్నారు.

 Indian-americans Protest Against Legislation On Caste-based Discrimination In Ca-TeluguStop.com

ఆ రాష్ట్ర శాసనసభకు ఎన్నికైన తొలి ముస్లిం , ఆఫ్ఘన్ అమెరికన్ సెనేటర్ ఐషా వహాబ్( Senator Aisha Wahab ) మార్చి 22న కాలిఫోర్నియా సెనేట్‌లో బిల్లును ప్రవేశపెట్టారు.ఈ బిల్లు కనుక ఆమోదం పొందితే అమెరికాలో అత్యధిక జనాభా కలిగిన కాలిఫోర్నియా కూడా కుల వివక్షను( Caste-Based Discrimination ) చట్ట ప్రకారం నిషేధించిన తొలి రాష్ట్రంగా నిలుస్తుంది.

అయితే ఉత్తర అమెరికా హిందువుల కూటమి (CoHNA) మాత్రం దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.సెనేటర్ వహాబ్ ప్రవేశపెట్టిన చట్టం .జాతి, మతం, పూర్వీకులతో సంబంధం లేకుండా అందరికీ సమానత్వం, న్యాయం అనే ప్రాథమిక సూత్రాలకు విరుద్ధంగా వుందన్నారు.ఇది హిందువులు, ఆసియన్లకు శరాఘాతం వంటిదని.

సమాజంలో ద్వేషాన్ని పెంచుతుందని ఫ్రీమాంట్ నగరానికి చెందిన హర్ష్ సింగ్ అన్నారు.

Telugu Americahindu, Calinia, Cohna, Kshama Sawanth, Aisha Wahab, Usa Nris-Telug

ఈ చట్టానికి వ్యతిరేకంగా పోస్టర్లు, బ్యానర్‌లను ప్రదర్శిస్తూ సెనేటర్ వహాబ్ కార్యాలయం ముందు దాదాపు 100 మంది నిరసనకారులు నినాదాలు చేశారు.హిందువులను వేరు చేయవద్దని, వారి పుట్టుక కారణంగా అణిచివేతకు పాల్పడినట్లు భావించవద్దని వారు విజ్ఞప్తి చేశారు.ఈ బిల్లు ఆమోదం పొందితే దక్షిణాసియన్లు, శ్వేతజాతీయేతర వ్యక్తుల హక్కులను ఉల్లంఘిస్తుందని CoHNA సభ్యులు పేర్కొన్నారు.

సమాన రక్షణ కూడా కల్పించదని అభిప్రాయపడ్డారు.

Telugu Americahindu, Calinia, Cohna, Kshama Sawanth, Aisha Wahab, Usa Nris-Telug

ఇకపోతే.కొద్దిరోజుల క్రితం అమెరికాలోని సీటెల్ నగరం సంచలన తీర్మానం చేసిన సంగతి తెలిసిందే.కుల వివక్ష చట్ట విరుద్ధమని ప్రకటించిన తొలి అమెరికా నగరంగా నిలిచింది.

ఇందుకోసం భారత సంతతికి చెందిన క్షమా సావంత్( Kshama Sawanth ) మొక్కవోని పోరాటం చేశారు.ఆమె ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సీటెల్ సిటీ కౌన్సిల్ 6-1 ఓట్ల తేడాతో ఆమోదించింది.

కుల వివక్షను చట్ట వ్యతిరేకమైనదిగా ప్రకటించడం వల్ల దక్షిణాసియా ప్రవాసులకు, ముఖ్యంగా భారతీయులకు, హిందువులకు ఒక ముఖ్యమైన సమస్యకు పరిష్కారం లభించినట్లేనని కౌన్సిల్ అభిప్రాయపడింది.అమెరికాలోని కంపెనీలు, కార్యాలయాల్లో దక్షిణాసియా వాసులు, వలస కార్మికులు కుల వివక్షను ఎదుర్కొంటున్నారని క్షమా సావంత్ తన తీర్మానంలో తెలిపారు.

ఈ ప్రతిష్టాత్మక తీర్మానానికి సీటెల్ కౌన్సిల్ తీర్మానం లభించిన నేపథ్యంలో క్షమా సావంత్ . దీనిని అమెరికా వ్యాప్తం చేయాల్సిన అవసరం వుందన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube