టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu ) ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నారు.ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఊహించిన దానికంటే మెరుగైన ఫలితాలు రాబట్టడంతో మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీదే విజయం అని ఇందులో నో డౌట్ అంటూ పార్టీ నేతలకు కార్యకర్తలకు గట్టిగానే భరోసా ఇస్తున్నారు.కాగా ఎన్నికలకు ఎంతో సమయం లేకపోవడంతో గెలుపే లక్ష్యంగా తన వ్యూహాలకు పదును పెడుతున్నారు.
ఏ ఏ స్థానాల్లో టీడీపీ బలంగా ప్రదర్శిస్తోంది.ఏ ఏ స్థానాల్లో ఇంకా పుంజుకోవాల్సి ఉంది.
అనే దానిపై నియోజిక వర్గాల వారీగా ఇప్పటికే సర్వేలు కూడా చంద్రబాబు తెప్పించుకున్నట్లు పోలిటికల్ సర్కిల్స్( Political circles ) లో వినికిడి.

ఆ సర్వేల ఆధారంగానే ఈసారి అభ్యర్థులను నెలబెట్టేందుకు చంద్రబాబు ప్రణాళికలు రచిస్తున్నారట.అయితే ఈసారి యువతకు అధిక ప్రదాన్యం కల్పిస్తామని ఘంటాపథంగా చెప్పుకోస్తున్న బాబు.సీనియర్స్ ను పక్కన పెడతారా ? అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి.అయితే అటు సీనియర్స్ కు ఇటు కొత్తగా టికెట్ ఆశించే యువతకు సామాన్యాయం చేసే విధంగా బాబు ప్రణాళికలు వేస్తున్నారట.అయితే అటు వైసీపీ, మరియు జనసేన పార్టీలు( Janasena parties ) యువతను ఆకర్షించడంలో కాస్త ముందున్నాయి.
ఎన్నికల్లో గెలుపోటములను శాసించడంలో యువత ఓటు కీలకంగా ఉంటుంది.

అందుకే ఈసారి యువతపైనే స్పెషల్ ఫోకస్ పెట్టారు చంద్రబాబు.ఇప్పటికే యువతను ఆకర్షించడంలో నారా లోకేష్( Nara Lokesh ) తన పాత్ర పోషిస్తున్నారు.అలాగే నియోజిక వర్గాల వారీగా యూత్ లో క్రేజ్ ఉన్న తెలుగుదేశం యువ నాయకులను ఈసారి ముందుంచే అవకాశం ఉంది.
రాబోయే ఎన్నికల్లో 40 శాతం సీట్లను యువతకే కేటాయిస్తామని చంద్రబాబు ఇటీవల మరోసారి స్పష్టం చేయడంతో టికెట్ ఆశిస్తున్న సీనియర్స్ కొంత భంగపాటుకు గురౌతున్నట్లు పోలిటికల్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.మరి వారిని చంద్రబాబు ఎలా బుజ్జగిస్తారనేది ఆసక్తికరం.
మొత్తానికి గెలుపే లక్ష్యంగా చంద్రబాబు వల్లిస్తున్న యువ మంత్రం టీడీపీకి ఎలాంటి ఫలితాలను ఇస్తుందో చూడాలి.







