లావుగా ఉన్నామని మదన పడుతున్నారా? శరీర బరువుపై ఇరుగు పొరుగు వారు చేసే కామెంట్లను సహించలేకపోతున్నారా? బరువు తగ్గి సన్నగా మారాలని డిసైడ్ అయ్యారా? అయితే ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ మీకు చాలా అద్భుతంగా సహాయపడుతుంది.ఈ డ్రింక్ ను రోజు నైట్ తీసుకుంటే ఎంత లావుగా ఉన్న వారైనా నెల రోజుల్లో సన్నబడతారు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ డ్రింక్ ఏంటో.దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని దానిపై రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు( Coriander ), మూడు యాలకులు వేసి బాగా వేయించుకోవాలి.ఇలా వేయించుకున్న ధనియాలు మరియు యాలకులను మిక్సీ జార్ లో వేసి మెత్తని పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి.
ఆ తర్వాత స్టవ్ ఆన్
చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోయాలి.వాటర్ హీట్ అవ్వగానే వన్ టేబుల్ స్పూన్ అల్లం తురుము వేసుకోవాలి.
అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న ధనియాలు, యాలకుల పొడి( Cardamom Powder ) ని వేసి ఎనిమిది నుంచి పది నిమిషాల పాటు మరిగించాలి.ఆపై స్టవ్ ఆఫ్ చేసి మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.ఈ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ తేనె కలిపితే మన డ్రింక్ సిద్ధం అయినట్టే.ప్రతిరోజు నైట్ ఈ డ్రింక్ ను తీసుకోవాలి.తద్వారా వేగంగా మరియు సులభంగా బరువు తగ్గుతారు.ఎంత లావుగా ఉన్నవారు అయినా సరే నెల రోజుల్లోనే సన్నగా మారతారు.
ఇక ఈ డ్రింక్ ను తీసుకోవడం వల్ల నిద్రలేమి( Insomnia ) నుంచి విముక్తి లభిస్తుంది.ప్రశాంతమైన, సుఖమైన నిద్ర మీ సొంతం అవుతుంది.అంతేకాదు ఈ డ్రింక్ ను తీసుకుంటే జీర్ణ వ్యవస్థ చురుగ్గా మారుతుంది.మలబద్ధకం సమస్య దూరం అవుతుంది.గ్యాస్, ఎసిడిటీ వంటివి దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.అలాగే ఇమ్యూనిటీ సిస్టం బూస్ట్ అవుతుంది.
మరియు మధుమేహుల్లో బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో సైతం ఉంటాయి.